Medak

News April 4, 2026

MDK: ఎన్నికల పారదర్శకతకు ఈవీఎంల భద్రత కీలకం: కలెక్టర్

image

నెలవారీ తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఈవీఎం గోదాంను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల భద్రత, సీసీ కెమెరాలు, అగ్ని ప్రమాద నివారణ, డబుల్ లాక్ వ్యవస్థలను సమీక్షించారు. భద్రతా సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఎన్నికల పారదర్శకతకు ఈవీఎంల భద్రత కీలకమని పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. అధికారులు పాల్గొన్నారు.

మెదక్: ఇంటర్‌తో పాటు ఐఐటీ, జేఈఈ ప్రారంభం: ఎస్‌వో

image

మెదక్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో(కేజీబీవీ) యంగ్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో భాగంగా ఇంటర్మీడియట్, ఐఐటీ, జేఈఈ ప్రారంభిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ కవిత తెలిపారు. ఆసక్తి గల పదో తరగతి విద్యార్థినిలకు సంబంధించిన వెబ్ పోర్టల్ నందు అర్హత పరీక్ష నిమిత్తం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈనెల 15లోగా దరఖాస్తు చేయాలని, మే 3న పరీక్ష ఉంటుందన్నారు.

News April 3, 2026

పీడీఎస్ సేవలు పారదర్శకంగా ఉండాలి: నిత్యానంద్

image

టేక్మాల్: రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ హెచ్చరించారు. వెలుపుగొండ రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేయగా 36.32 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో డీలర్ దినకర్‌పై 6-ఏ నిబంధన కింద కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

News April 2, 2026

మెదక్‌: ఫిజికల్ సైన్స్ పరీక్షకు 99.83% హాజరు

image

మెదక్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా ఫిజికల్ సైన్స్ పరీక్షకు 99.83 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 11,247 మందికి గాను 11,228 మంది పరీక్ష రాశారని జిల్లా విద్యాశాఖ అధికారి విజయ తెలిపారు. పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.

News April 2, 2026

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

image

అల్లాదుర్గం మండలం చిల్వర్ గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ గ్రామసభలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యచరణపై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి పేదవాడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామసభలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సక్రమంగా తీర్మానాలు చేయాలని అధికారులకు సూచించారు.

News April 2, 2026

మెదక్: ‘మీ సేవ’ ఛార్జీల పెంపు: అదనపు కలెక్టర్

image

‘మీ సేవ’ కేంద్రాల ఛార్జీలు పెంచినట్లు మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. కనీస ఛార్జీ రూ.35 నుంచి రూ.62కి పెరిగిందని, A కేటగిరీకి రూ.62, B కేటగిరీ సేవలకు రూ.80గా నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై మీసేవ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ధరలకు మించి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 3వ తేదీన మెయింటెనెన్స్ డే కారణంగా కేంద్రాలు పనిచేయవన్నారు.

News April 2, 2026

మనోహరాబాద్: సబ్బుపై హనుమాన్ రూపం

image

హనుమాన్ జయంతి సందర్భంగా చిత్రకారుడు సబ్బుపై హనుమాన్ చిత్రం చెక్కారు. మనోహరాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్ర లేఖనం ఉపాధ్యాయుడు బ్రహ్మచారి సబ్బుపై వీర హనుమాన్ రూపాన్ని చెక్కి తన భక్తిని చాటుకున్నారు. చిత్ర లేఖనంతో విద్యార్థుల భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఉపాధ్యాయుడిని పలువురు అభినందించారు.

News April 2, 2026

మెదక్: గడ్డిమందు కొనుగోలు, వినియోగం చేయరాదు: వ్యవసాయ అధికారి

image

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గడ్డి మందు విక్రయాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజుల నిషేధం విధించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ తెలిపారు. ఈ నిషేధం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. రైతులు గడ్డి మందు కొనుగోలు, వినియోగం చేయరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అమ్మకాలు జరిపే ఫర్టిలైజర్ దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.