India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెదక్ పట్టణంలో పలు రేషన్ దుకాణాలను ఆదివారం మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపులోని రికార్డు వివరాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలని అన్నారు. ఎవరైనా రేషన్ బియ్యంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ మున్సిపల్ ఛైర్మన్ రాధిక భూపతి రాజు, తహశీల్దార్ లక్ష్మణ్ బాబు ఉన్నారు.

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళి అర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, మాజీ ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలను స్మరించారు. సామాజిక న్యాయం, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటంలో ఆయన పాత్ర గొప్పదన్నారు. కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించి దేశ ప్రగతికి కృషి చేశారని పేర్కొన్నారు. దళిత సాధికారతకు దళిత బంధు వంటి పథకాలు ఆయన ఆలోచనల స్ఫూర్తితోనే అమలవుతున్నాయన్నారు.

భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడిగా బాబు జగ్జీవన్ రామ్ గుర్తుండిపోతారన్నారు. పీడిత వర్గాల అభ్యున్నతి, కార్మికుల హక్కుల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయ సాధనలో మనమందరం భాగస్వాములమవుదామని పిలుపునిచ్చారు.

మెదక్ జిల్లాలో 520 రేషన్ దుకాణాల ద్వారా ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల సన్న బియ్యం సరఫరా జరుగుతోందని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. లబ్ధిదారులు తొందరపడకుండా ఈ నెల 30 వరకు సమీప రేషన్ దుకాణాల్లో సరుకులు పొందాలని సూచించారు. సరుకుల కొరత లేదని, పారదర్శకంగా పంపిణీ జరుగుతుందని చెప్పారు. వదంతులు నమ్మకుండా అవసరమైతే అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఓటర్ల మ్యాపింగ్, బూత్ స్థాయి అధికారుల శిక్షణ, బూత్ స్థాయి అధికారులు మ్యాపింగ్ త్వరితగతిన చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

హెల్త్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 6 నుంచి 11 వరకు వారం రోజులపాటు హెల్త్ వీక్ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. హెల్త్ వీక్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు.

మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల ఇంధన సరఫరా విషయంలో కూడా ఎక్కడా కొరత లేదని, బుకింగ్ చేసుకున్న వారికి యథావిధిగా డెలివరీ జరుగుతుందని వదంతులు నమ్మవద్దని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ శనివారం తెలియజేశారు. జిల్లాలో మొత్తం 87 పెట్రోల్ బ్యాంకులు, 16 గ్యాస్ ఏజెన్సీలు సక్రమంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని నిజంలేదన్నారు.
Sorry, no posts matched your criteria.