India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెదక్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నెల 1 నుంచి 30 వరకు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కాలంలో జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిషేధమని హెచ్చరించారు. ఈ నిబంధనలకు సహకరించాలని ఆయన ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులను కోరారు.

ఆగస్టు నెలలో షీ టీమ్స్ కఠిన చర్యలు తీసుకుని 2 ఎఫ్‌ఐఆర్‌లు, 18 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ డీవి శ్రీనివాసరావు తెలిపారు. మహిళల భద్రత కోసం 73 మందికి కౌన్సెలింగ్ ఇచ్చామని, 47 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఫిర్యాదుల కోసం పోలీస్ హెల్ప్‌లైన్ 100 / 8712657963 అందుబాటులో ఉందని, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని ఎస్పీ హామీ ఇచ్చారు.

మెదక్ పట్టణంలో అర్ధరాత్రి నుంచి ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో 46.3 మి.మీ., సర్ధనలో 43.3 మి.మీ., మెదక్ మండలం రాజుపల్లిలో 36.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. చేగుంటలో 16 మి.మీ.లకుపైగా వర్షం పడింది. దీంతో మెదక్, హవేలీ ఘనపూర్, రామాయంపేట, పాపన్నపేట మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

తూప్రాన్ పట్టణ పరిధి ఆబోతుపల్లి శివారులో హల్దీ వాగుపై నూతనంగా రూ.4.5 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదన చేసినట్టు తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. హల్దీ వాగుపై నిర్మించిన కాజ్ వే వరదలకు కొట్టుకుపోవడంతో ఆదివారం ఆయన పరిశీలించారు. నూతన బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని తెలిపారు. కాజ్ వే దెబ్బ తినడంతో రాకపోకలకు అవకాశం లేదన్నారు.

ఆగస్టులో షీ టీమ్స్ చేపట్టిన చర్యల్లో భాగంగా మెదక్ డివిజన్‌లో ఈవ్‌టీజర్స్‌పై 2 ఎఫ్ఐఆర్‌లు, 14 ఈ-పెట్టీ కేసులు, తూప్రాన్ డివిజన్‌లో 4 ఈ-పెట్టీ కేసులు నమోదయ్యాయని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2 ఎఫ్ఐఆర్‌లు, 18 కేసులు నమోదయ్యాయన్నారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన 73 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

కలెక్టరేట్‌లో రేపు సోమవారం ప్రజావాణి హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు వరద సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని కలెక్టర్ తెలిపారు. సోమవారం ప్రజావాణి హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్లు స్పష్టం చేశారు. దీనిని ప్రజలు గమనించాలని కోరారు.

పకృతి విలయతాండవంతో జిల్లాలో భారీ నష్టం సంభవించినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. నిజాంపేట్ మండలంలో వరదలతో కోతకు గురైన వంతెనలు రోడ్లను పరిశీలించారు. 11 మండలాల్లో వర్షాల వరదలతో నష్టాలు కలగాయని, రెండు మండలాల్లో 300 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం, వరదల ప్రవాహంతో భారీ నష్టం సంభవించినట్లు వివరించారు. 130 గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, యుద్ధ ప్రతిపాదికన పునరుద్ధరించినట్టు వివరించారు.

రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈరోజు పర్యటించారు. గ్రామంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. గ్రామంలో నీట మునిగిన పొలాలను, కొట్టుకుపోయిన బ్రిడ్జిని, చిన్న చెరువు కట్టను ఆయన పరిశీలించారు. నష్టపోయిన వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి కమ్మరి రమేశ్ ఉన్నారు.

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం మన పాఠశాల-మన ఆత్మగౌరవం కార్యక్రమాన్ని నిర్వహించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సంగారెడ్డిలో తపస్ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలు ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మన పాఠశాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, నాయకుడు మాధవరెడ్డి పాల్గొన్నారు.

రేపు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద పీఆర్టీయూ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాకు మెదక్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలిరావాలని ఆ సంఘం మెదక్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ల శ్రీనివాస్, సామ్యా నాయక్, మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓపీఎస్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.