India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలన వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అధ్యాయమని హరీశ్ రావు అన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామి అని చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అని, పత్తి ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉందన్నారు. పంటల సాగులో తెలంగాణ మేటి అని అన్నారు. దేశానికే మన తెలంగాణ ఆదర్శమని చెప్పారు. ఇదంతా మంత్రమేస్తేనో, మాయ చేస్తేనో జరిగింది కాదని ఎక్స్ వేదికగా తెలిపారు.
స్కూల్ గేమ్స్ జూనియర్ కాలేజ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉమ్మడి మెదక్ జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ గణపతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మెదక్‌లోని ఇందిరాగాంధి స్టేడియంలో అండర్-19 బాలబాలికల విభాగంలో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 9 గంటల వరకు పదోతరగతి మెమో, బోనాఫైడ్, బర్త్ సర్టిఫికెట్, ఆధార్‌కార్డుతో హాజరుకావాలని తెలిపారు.
స్కూల్ గేమ్ ఫెడరేషన్ (ఇంటర్మీడియట్) ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన మెదక్‌లోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఉమ్మడి జిల్లా అథ్లెటిక్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కార్యదర్శి గణపతి బుధవారం తెలిపారు. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు మాత్రమే ఎంపికలకు అర్హులని చెప్పారు. వీటికి హాజరయ్యే విద్యార్థులు పదో తరగతి మెమో, ఇంటర్ బోనాఫైడ్, బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకొని రావాలని పేర్కొన్నారు.
మెదక్ పట్టణంలోని తెలంగాణ భవన్లో బుధవారం జిల్లా సమైక్య 7వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు 100% అక్షరాస్యత సాధించాలన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా జిల్లా సమైక్య ప్రగతి పథంలో ముందుకు పోవడం శుభపరిణామం అన్నారు. ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని డీఎస్సీ 2008 అభ్యర్థుల సెలక్షన్ జాబితాను https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్సైట్లో ఉంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27 నుంచి జిల్లా విద్యాధికారి కార్యాలయంలో జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు.
జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కొనుగోలు కేంద్రాలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వచ్చే నెల 25వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, సివిల్ సప్లై డీఎం కొండల్ రావు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మనూ చౌదరితో కలిసి ఆయా అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కొత్త ప్రభాకరరెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు.
రైతు నేస్తానికి ఆదరణ కరవైంది. ప్రభుత్వం ప్రతి మంగళవారం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో వ్యవసాయ శాఖ ఉన్నతా ధికారులు, శాస్త్రవేత్తలు ముఖాముఖి నిర్వహించి సాగు విధానం, పంటల దిగుబడి, సస్యరక్షణ చర్యలపై సలహాలు, సూచనలు అందిస్తారు. చాలామందికి రుణమాఫీ కాకపోవడంతో రైతులు బ్యాంకులు, వ్యవ సాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో రైతు నేస్తానికి రాకపోగా అధికారులు మాత్రమే కనిపిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో మంగళవారం కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి చెందారు. వివరాలిలా.. ధూళ్మొట్ట మండలం కొండాపూర్‌కు చెందిన తిరుపతి(25) ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఏజీ స్విచ్ అఫ్ చేస్తుండగా కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. దుబ్బాక మండలం రఘొత్తంపల్లి గ్రామానికి చెందిన అంజయ్య పొలంలో మొక్కలు కొస్తుండగా కరెంట్ షాక్‌తో చనిపోయాడు.
సంగారెడ్డిలోని ప్రభుత్వం మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలో 98.66% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఫలితాల్లో 145 మంది ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధా మాధురి తెలిపారు. ఇందులో నలుగురు డిస్టింక్షన్‌లో సాధించగా, 108 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు.
Sorry, no posts matched your criteria.