India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

492 పంచాయతీలలో పనుల జాతర-2025 ఘనంగా నిర్వహించాలని డీఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు, పూర్తి కావాల్సిన పనులకు శంకుస్థాపనలు చేయాలని సూచించారు. శాసనసభ్యులు, శాసన మండల సభ్యులు, పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేస్తామన్నారు. పనుల జాతరలో భాగంగా 22న ముఖ్యంగా పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, కోళ్ల ఫామ్ షెడ్లు ప్రారంభించాలని పేర్కొన్నారు.

భర్త మరణంతో కుటుంబ పోషణ భారమై భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తూప్రాన్ ఎస్ఐ శివానందం తెలిపారు. తూప్రాన్‌కు చెందిన గజ్జల బాబుకు సంధ్యతో వివాహం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో 4 నెలల క్రితం బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. బాబు మరణంతో భార్య సంధ్య(34)కు కుటుంబ పోషణ భారమైంది. ఈ క్రమంలో 13న ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

మెదక్ జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, వివిధ మండప నిర్వాహకులు పాల్గొన్నారు. సభ్యుల సందేహాలను కలెక్టర్, ఎస్పీ నివృత్తి చేశారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల హక్కుల సాధన కోసం అక్టోబర్ 12న ‘చలో హైదరాబాద్’ పేరిట ‘జంగ్ సైరన్’ నిర్వహించనున్నట్లు ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ తెలిపారు. మెదక్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో సుమారు లక్ష మంది కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. హక్కులను సాధించుకోవడానికి ఈ ఉద్యమ కార్యాచరణను ప్రకటించినట్లు వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మెదక్ సబ్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఆర్.ఎం.సుభవల్లి తనిఖీ చేశారు. ఖైదీలకు అందుతున్న వసతులు, వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. న్యాయ సలహాలు ఇచ్చారు. మీరు తప్పులు చేసి జైలుకు వస్తే మీ వల్ల మీ కుటుంబం ఇబ్బందులకు గురవుతుంది. మానసికంగా క్షోభకు గురవుతారన్నారు. కావున ఒకసారి జైలు నుంచి బయటకు వెళ్లాక సత్ప్రవర్తనతో మెలగాలని, మళ్లీ తప్పులు చేసి జైలుకు రావొద్దని సూచించారు.

మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మ ప్రధాన ఆలయం 7వ రోజు బుధవారం సైతం జలదిగ్బంధంలోనే చిక్కుకుంది. భారీ వర్షాలతో వనదుర్గా ప్రాజెక్ట్ పొంగి పొర్లుతుంది. ఉదయం రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా 1965-1966లో ఈ ఆలయం దేవాదాయ శాఖ అధీనంలోకి వెళ్లింది. దేశంలో రెండో వనదుర్గమ్మ ఆలయం ఏడుపాయల కావడం విశేషం. దీంతో ఏడుపాయల కీర్తి ఎల్లలు దాటింది.

మెదక్ జిల్లాలో వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాపన్నపేట మండలం లింగాయపల్లిలో 29.5 మిమీల వర్షపాతం నమోదయింది. రాజుపల్లిలో 27.5, చిన్న శంకరంపేటలో 25, మాసాయిపేటలో 23.8, చేగుంటలో 21.8, మెదక్‌లో 18.8, దామరంచలో 16.8, కొల్చారంలో 16.5, రామాయంపేటలో 15.8 మిమీల వర్షం మాత్రమే కురిసింది.

భూలోకానికి వస్తున్న గణనాథులు నవరాత్రులు పూజలు అందుకొనున్నారు. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇప్పటికే గణపతి మండపాలను నిర్మాణం చేస్తున్నారు. ఆగస్టు 27 నుంచి వినాయక చవితి ఉన్నందున పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చందాలు, మండప నిర్మాణాల పనుల్లో నిమగ్నమైపోయారు.

తాను నడవలేనని బాధపడలేదు.. కనుమరుగవుతున్న కళలకు జీవం పొసేందుకు ముందడుగు వేశాడు ఓ దివ్యాంగుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెండు పీజీలు చదివాడు. మెదక్ జిల్లా కుర్తివాడ గ్రామానికి చెందిన దేవయ్య.. గ్రామ, మండల విద్యార్థులకు జడకోప్పు, కోలాటం, యోగ్చాప్, చెక్కభజనలో శిక్షణ ఇస్తున్నాడు. వీటికి అవసరమయ్యే సామగ్రిని అతడే కొనుగోలు చేసి సమాజ సేవలో తన వంతుగా సామజిక బాధ్యత వహిస్తున్నారు .

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా కలెక్టరేట్ రాహుల్ రాజ్ ఫోటోగ్రాఫర్లను సత్కరించారు. ఫోటోగ్రాఫర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రదీప్‌ను సన్మానించి మెమొంటో అందజేసి అభినందించారు. ఫోటోగ్రాఫర్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక చిత్రం ఎన్నో పదాలు, ఎన్నో అర్థాలు తెలుపుతుందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాలంటే ఫోటోలు ముఖ్యమన్నారు. డీపీఆర్ఓ రామచంద్ర రాజు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.