India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టేక్మల్ మండలం చంద్రుతాండ గ్రామంలోని సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సన్న బియ్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కలెక్టర్‌తో పాటు ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంపీఓ, పంచాయతీ అధికారి భోజనం చేశారు.

మహిళలు, బలహీనవర్గాల విద్యాభివృద్ధి రూపకర్త, సమ సమాజ స్థాపనకు స్ఫూర్తిదాత, మానవ హక్కుల అవిశ్రాంత యోధుడు మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఈ నెల 11న అధికారికంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 11న ఉదయం 10:30 గంటలకు ధ్యాన్ చంద్ చౌరస్తాలో గల జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల అనంతరం కలెక్టరేట్లో కార్యక్రమం ఉంటుందన్నారు.

ధరణి సమస్యలను పక్కా ప్రణాళికతో పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ధరణి సమస్యలపై సంబంధిత అదనపు కలెక్టర్ నగేష్, సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణి సమస్యలపై దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగులో ఉన్న దరఖాస్తులపై దృష్టి సారించాలన్నారు.

మెదక్ జిల్లాల్లో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు గులాబీ నేతలు, KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRS నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీ కామెంట్..?

ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 601 మంజూరు పోస్టులకు గాను 131 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 470 ఖాళీలు ఉన్నాయి. అకాడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో సగమే భర్తీ చేస్తారని సమాచారం.

నేటి నుంచి 17 వరకు సంగ్రహణాత్మక మూల్యాంకనం-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ తెలిపారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఈ నెల 9 నుంచి, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈనెల 11 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. పరీక్షలు ఉదయం గం.9 నుంచి మధ్యాహ్నం గం.12 వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

SRD జిల్లా మొగుడంపల్లి మం. ధనశ్రీలో జరిగిన మహమ్మద్ అబ్బాస్ అలీ(25) <<16017699>>హత్య<<>> కేసును చిరాగ్పల్లి పోలీసులు ఛేదించారు. DSP రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాలు.. తన తల్లిని అబ్బాస్ వేధిస్తున్నాడని ఈనెల 6న ఖలీల్ షా, తన స్నేహితుడు మమ్మద్ బిస్త్‌తో కలిసి హత్య చేశారు. అడ్డొచ్చిన షేక్ అక్బర్ అలీపై బాటిల్‌తో దాడి చేశారు. నిందితులు పారిపోతూ అటుగా వచ్చిన మరో వ్యక్తిని గన్‌తో బెదిరించి అతడి బైక్‌పై పారిపోయారు.

సిద్దిపేట జిల్లాలో బర్డ్‌ఫ్లూ భయం పట్టుకుంది. తొగుట మండలం కన్గల్లోని ఓ లేయర్ కోళ్ల ఫామ్‌లోని కోళ్లకు H5N1(బర్డ్‌ఫ్లూ) నిర్ధరణ కావడంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. బర్డ్‌ఫ్లూ వ్యాపించకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఫాంలోని కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో భూమిలో పూడ్చివేయనున్నారు.

అల్లదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన నాయకిని సురేశ్ తన స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని కుంటలో ఎద్దులను కడగడానికి వెళ్లారు. ప్రమాదపుశాత్తు సురేష్ నీట మునిగినట్లు స్నేహితులు గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులు అతడిని బయటకి తీసి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కొడుకు మృతి పట్ల అనుమానం ఉందని తండ్రి నర్సింలు పోలీసులకు పిర్యాదు చేసారు. సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు పూర్వ వీఆర్వోలు వినతి పత్రం సమర్పించారు. వీఆర్వోలు, వీఆర్ఏలను జిపిఓలుగా తీసుకోవడానికి జారీచేసిన జీవో 129ను సవరణ చేసి పాత వీఆర్వోలను యధావిధిగా కామన్ సర్వీస్ ఇస్తూ నియామకం చేయాలని కోరారు. మెదక్‌లో సమావేశం నిర్వహించి 16లోగా గూగుల్ ఫారం నింపాలని జారీ చేసిన ఆదేశాలపై చర్చించారు. జీవో లోపాలను సవరిస్తూ పాత సర్వీస్ కౌంట్ చేస్తూ, యధావిధిగా తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు
Sorry, no posts matched your criteria.