Medak

News July 21, 2024

మెదక్: నవోదయ నోటిఫికేషన్ విడుదల

image

నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైందిన సిద్దిపేట జిల్లా వర్గల్ జవహర్‌ నవోదయ ప్రిన్సిపల్ రాజేందర్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని విద్యార్థులు సెప్టెంబర్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 2025 జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. www.navodaya.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

News July 21, 2024

ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తాం: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో టీఎన్జీవో ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. బదిలీలకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. సమావేశంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ, కార్యదర్శి రవి, అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.

News July 20, 2024

తూప్రాన్: పౌల్ట్రీ రైతు ఆత్మహత్య

image

తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం పౌల్ట్రీ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్రెడ్డిపల్లికి చెందిన గార్ల ఆంజనేయులు (40) పౌల్ట్రీ, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఈరోజు సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య మౌనిక, ముగ్గురు సంతానం ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 20, 2024

తూప్రాన్: పౌల్ట్రీ రైతు ఆత్మహత్య

image

తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం పౌల్ట్రీ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్రెడ్డిపల్లికి చెందిన గార్ల ఆంజనేయులు (40) పౌల్ట్రీ, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఈరోజు సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య మౌనిక, ముగ్గురు సంతానం ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 20, 2024

మెదక్ కలెక్టరేట్‌లో ప్రజాపాలన సేవా కేంద్రం ప్రారంభం

image

మెదక్ కలెక్టరేట్‌లో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఈ ప్రజా పాలన సేవా కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి గతంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల లోటుపాట్లు సవరించుకోవచ్చని తెలిపారు. నూతనంగా ప్రారంభించిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆన్లైన్‌లో వివరాలు నమోదు ప్రారంభించారు.

News July 20, 2024

మెదక్: 22న కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి

image

మెదక్ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అలాగే జిల్లాలోని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు మెదక్ ఆర్డీవో రమాదేవి తెలిపారు. ఉదయం 10:30 నుంచి 2:30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 20, 2024

మెదక్: జాతీయ రహదారిపై కారు బోల్తా.. మహిళ మృతి

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కళ్లకల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బాసర వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందగా నలుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితులు హైదరాబాద్ మూసాపేట్ చెందిన వారిగా సమాచారం.

News July 20, 2024

గజ్వేల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

గజ్వేల్ మండలం రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక CI సైదా తెలిపిన వివరాల ప్రకారం.. ఏటిగడ్డకిష్టాపూర్ R&R కాలనీకి చెందిన రాజేశ్ బంధువైన మురళితో కలిసి ప్రజ్ఞపూర్ వైపు బైక్‌పై వెళ్తున్నారు. ముందున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి చెట్టును, ఓ భవనం మెట్లను ఢీకొన్నారు. మురళికి గాయాలవగా, రాజేశ్ అక్కడికక్కడే చనిపోయాడు. కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదైంది.

News July 20, 2024

సంగారెడ్డి: ‘విద్యార్థులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాం’

image

విద్యార్థులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News July 20, 2024

SRD: ‘భారీ వర్షాలు.. ప్రజలను అప్రమత్తం చేయండి’

image

జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం లో తెలిపారు. వరదల వల్ల నష్టం జరగకుండా అధికారులు మందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు అందుబాటులో ఉండాలని చెప్పారు. చెరువు కట్టలు తెగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.