Medak

News February 5, 2026

మెదక్: మున్సిపల్ ప్రచారంలో సర్పంచుల బిజీ!

image

మెదక్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాలను వదిలి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లోని అభ్యర్థుల గెలుపు కోసం వీరు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వార్డుల్లో తిరుగుతూ అభ్యర్థుల తరపున ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సొంత గ్రామాల కంటే మున్సిపల్ వార్డుల్లోనే సర్పంచుల సందడి ఎక్కువగా కనిపిస్తోంది.

News February 5, 2026

మెదక్: అర్ధరాత్రి మంత్ర పూజలు?

image

శివంపేట మండలంలోని అల్లీపూర్ గ్రామంలో నింగ బాలరాజ్, గోవర్ధన్ అనే అన్నదమ్ముల ఇంటి ముందు అర్ధరాత్రి జరిగిన అనుమానాస్పద పూజలు కలకలం రేపాయి. తెల్లవారుజామున ఇంటి ముందు మంత్ర పూజల గుర్తులు చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఎవరో కావాలనే భయపెట్టేందుకు ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

News February 5, 2026

తూప్రాన్: ఎన్నికల బరిలో తోటి కోడలు

image

తూప్రాన్ పట్టణ మున్సిపల్ పరిధి ఎన్నికల బరిలో తోటి కోడళ్లు పోటీ చేస్తున్నారు. ఒకరు తాజా మాజీ కౌన్సిలర్ కాగా, మరొకరు నూతనంగా ఎన్నికల బరిలో నిలిచారు. తూప్రాన్ మున్సిపల్ పరిధి 12వ వార్డులో తాజా మాజీ కౌన్సిలర్ బొంది అరుణ వెంకట్ గౌడ్ పోటీ చేస్తున్నారు. ఆమె తోటి కోడలు బొంది రజిని రాఘవేందర్ గౌడ్ 1వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె భర్త రాఘవేందర్ గౌడ్ ఇదే వార్డులో తాజా మాజీ కౌన్సిలర్‌గా ఉన్నారు.

News February 5, 2026

రేగోడ్: టాపర్‌గా నిలవండి.. రూ.5 లక్షలు గెలవండి!

image

రేగోడు, లింగంపల్లి, గజవాడ పాఠశాలల్లో ఓ సంస్థ ఆధ్వర్యంలో ‘చదువుకో తెలంగాణ’పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. టెన్త్ వార్షిక పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు రూ.5 లక్షల నగదు బహుమతి అందిస్తారని MEO గురునాథ్ తెలిపారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి అందిస్తున్న సాయం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News February 4, 2026

ఏడుపాయల వనజాతర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: కలెక్టర్

image

ఏడుపాయల వనదుర్గా క్షేత్రంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. బుధవారం ఏడుపాయలలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

News February 4, 2026

మెదక్: అర్ధరాత్రి యాక్సిడెంట్!

image

శివంపేట్ మండలం పరిధిలోని పిల్లుట్ల గేట్ సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో బైక్ తీవ్రంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో బైక్‌పై ఉన్న వ్యక్తి రోడ్డు పక్కనే పడిపోయి గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

News February 4, 2026

పదవ తరగతిలో మెరుగైన ఫలితాలే లక్ష్యం: డీఈవో

image

విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని DEO విజయలక్ష్మి పిలుపునిచ్చారు. పాపన్నపేట మండలం యూసుఫ్‌పేట ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన డీఈవో, చదువుపై పూర్తి దృష్టి సారించాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల మార్గనిర్దేశాన్ని పాటిస్తూ లక్ష్య సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు హితవు పలికారు.

News February 3, 2026

మెదక్: ఎన్నికల భద్రతపై డీజీపీ సమీక్ష

image

మున్సిపల్ ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస రావుతో కలిసి పలు సూచనలు చేశారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక కేంద్రాలు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని డీజీపీ ఆదేశించారు. పోలీసులకు ఎన్నికల చట్టాలపై లీగల్ అవగాహన కల్పించి, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News February 3, 2026

మెదక్ మున్సిపల్ బరిలో 113 మంది.. ఒక వార్డు ఏకగ్రీవం

image

మున్సిపల్ ఎన్నికల పోరులో మెదక్ మున్సిపాలిటీలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది. మొత్తం 32 వార్డులకు గాను, 32వ వార్డు కౌన్సిలర్‌గా గోదల మానస సాయిరాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 31 వార్డుల్లో 112 మంది పోటీలో నిలిచారు. ప్రధాన పార్టీల వారీగా.. కాంగ్రెస్ 32, బీఆర్‌ఎస్ 31, బీజేపీ 27 వార్డుల్లో అభ్యర్థులను నిలపగా, బీఎస్పీ 6 చోట్ల పోటీ చేస్తోంది. ఇద్దరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఉండటం ఆసక్తికరంగా మారింది.

News February 3, 2026

మెదక్: మున్సిపల్.. తల్లి, కొడుకు పోటీ

image

మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో రక్తసంబంధీకుల పోటీ ఆసక్తి కలిగిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఛైర్మన్ బట్టి జగపతి సతీమణి లలితతో పాటు ఆమె కుమారుడు ఉదయ్ కూడా బరిలో నిలిచారు. గతంలో 18వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన లలిత మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, గత ఎన్నికల్లో 5వ వార్డులో ఓటమి చెందిన ఉదయ్ ఈసారి విజయంపై ధీమాతో ఉన్నారు. తల్లి, కొడుకుల ఫలితం ఎలా ఉంటుందోనని పట్టణంలో చర్చ నడుస్తోంది.