India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మూడో విడత రుణమాఫీ(రూ.1.5 నుంచి 2 లక్షలు)ని సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మెదక్ జిల్లాలో 53,479 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 2 విడుతల రుణమాఫీ చేసిన ప్రభుత్వం తాజాగా 3వ విడత నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో 53,479 మంది రైతులకు రూ. 710.22 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు సమాచారం.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆర్యవైశ్యులందరికి తనవంతు సహకారం ఎప్పుడు ఉంటుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం రాత్రి సిద్దిపేటలోని ఆర్యవైశ్య భవనం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ కాల్వ సుజాత, బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
రుణమాఫీ హామీపై మాట తప్పినందుకు సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, హరీశ్రావు ధ్వజమెత్తారు. తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేననే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ రేవంత్ రెడ్డి నిరూపించుకుంటున్నారని విమర్శించారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరని మండిపడ్డారు.
రుణమాఫీ అందరికీ కాలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటోందని BRS నేత, నారాయణఖేడ్ మాజీ MLA భూపాల్ రెడ్డి అన్నారు. పెద్దశంకరంపేటలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఎవ్వరిని అడిగినా రుణమాఫీ కాలేదనే చెబుతున్నారని, మరి ఎవరికి మాఫీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదని, పథకాలు అందించిన BRS కావాలా.. మోసం చేసిన కాంగ్రెస్ కావాలా అని అడిగారు.
మెదక్ డైట్లో అతిథి అధ్యాపకులుగా 16 పోస్టులు ఉన్నాయని, వాటికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ డీఈవో రాధాకిషన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హవేలిఘనపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్)లోని వివిధ విభాగాల్లో 16 పోస్టులు ఉన్నాయని తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల 21వ తేదీలోగా డైట్లో అందజేయాలని పేర్కొన్నారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 16-21 తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు RTC ప్రాంతీయ మేనేజర్ ప్రభులత పేర్కొన్నారు. బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా డిపో మేజేజర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా బస్టాండ్లలో ఎప్పటికప్పుడు రద్దీ పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈనెల 16న 32, 17న 35, 18న 55, 19న 70, 20న 45, 21న 28 కలిపి మొత్తం 265 బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశానికి ఈనెల 17వ తేదీ వరకు గడువు పెంచినట్లు ప్రిన్సిపల్ రాజేశ్వర రావు బుధవారం తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు http://iti.telangana.gov.in లో అప్ లోడ్ చేయాలని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని చెప్పారు.
యువకుడి సూసైడ్ కేసులో సూరారం పోలీసులు వివరణ ఇచ్చారు. INSTAలో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని గుమ్మడిదల మం.దోమడుగుకు చెందిన శ్రీహరి పట్టుబట్టాడు. పేరెంట్స్ మందలించడంతో ఆమె దూరం పెట్టింది. ఈ విషయమై యువకుడి తల్లి బెదిరించగా యువతి సూసైడ్ చేసుకుంది. <<13843632>>భయంతో శ్రీహరి<<>> పురుగు మందు తాగి ఆస్పత్రి పాలయ్యాడు.ఈనెల 12న ఆస్పత్రి నుంచి పారిపోయి ‘ప్రియురాలి వద్దకే వెళ్తున్నా అంటూ’ ఉరేసుకున్నాడు.
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ధరణికి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఫిర్యాదులు ఎవరికి చేయాలో తెలియక వచ్చిన వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు నిరాశతో విని తిరిగి వెళ్ళిపోతున్నారు. దీంతో కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ధరణి సహాయ కేంద్రాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఏర్పాటు చేయించారు. సమస్యలపై రైతులు ఇక్కడ సంప్రదించవచ్చని తెలిపారు.
మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన తలారి పోచమ్మ(70), ఎల్లవ్వ (50) అనే ఇద్దరు తల్లీకూతురు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోచమ్మ కుమారుడు హైదరాబాదులో ఉంటుండగా తల్లీకూతురు గ్రామంలో ఉంటున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.