Medak

News February 6, 2025

మెదక్ జిల్లాలో తగ్గిన చికెన్ ధరలు

image

మెదక్ జిల్లాలో చికెన్ ధరలు తగ్గాయి. గత వారం రోజుల క్రితం కిలో రూ. 240పైగానే అమ్మారు. గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్‌లెస్ KG రూ. 210 నుంచి రూ. 220, విత్ స్కిన్ రూ. 180 నుంచి రూ. 190 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ. 5 నుంచి రూ. 10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమల్లో H5N1 వైరస్‌ కోళ్ల చనిపోవడం ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది.

News February 6, 2025

బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు హైకోర్టులో ఊరట

image

గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఈ కేసును కొట్టి వేయాలని హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ కేసును కొట్టి వేయాలని హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 12 వరకు అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

News February 5, 2025

సంగారెడ్డి: నవ వధువు సూసైడ్

image

అదనపు కట్నం వేధింపులతో <<15357920>>నవ వధువు<<>> సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. వికారాబాద్‌ సాకేత్ నగర్‌కు చెందిన సాయికి సంగారెడ్డి జిల్లా మునిపల్లికి చెందన శ్రీజతో గతేడాది నవంబర్‌లో పెళ్లైంది. ఇంతలో అదనపు కట్నం కోసం భర్త వేధించ సాగాడు. ఇప్పుడు డబ్బులు ఇచ్చే స్థితిలో మా వాళ్లు లేరని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా భర్త వినలేదు. దీంతో విషయం కుటుంబీకులు నిన్న ఫోన్‌లో చెప్పిన శ్రీజ అనంతరం ఇంట్లో ఉరేసుకుంది.

News February 5, 2025

శివంపేట హత్య కేసు UPDATE

image

శివంపేట మండలం సామ్యతండాలో శనివారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తండాకు చెందిన మదన్‌లాల్‌ను కత్తితో పొడిచి హత్య చేయగా ఈ కేసుపై తూప్రాన్ సీఐ రంగాకృష్ణ దర్యాప్తు చేపట్టారు. మదన్‌లాల్‌‌ను అన్న కొడుకే హత్య చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. అతడికి సహకరించిన మరో వ్యక్తిని సైతం అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

News February 5, 2025

ఆర్టీసీ బస్సులను వినియోగించుకోండి: డీఎం సురేఖ

image

వివాహ శుభకార్యాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని మెదక్ డీఎం సురేఖ కోరారు. 200 కిలోమీటర్లకు పల్లెవెలుగు బస్సుకు రూ.13,200, ఎక్స్ ప్రెస్ బస్సుకు రూ.14,700 ఉంటుందన్నారు. ఈ రేట్లు 12 గంటల సమయం పాటు వర్తిస్తాయని, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని ఆమె కోరారు.

News February 5, 2025

మెదక్: రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం జిల్లా క్రీడాకారులు

image

మెదక్ జిల్లాకు చెందిన రగ్బీ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మంచిర్యాల జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌17 సెమీ కాంటాక్ట్ రబీ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలిచారు. వెండి పతకం సాధించిన రగ్బీ క్రీడాకారులను మెదక్ జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు కర్ణం గణేశ్ రవికుమార్ అభినందించారు.

News February 5, 2025

మెదక్: 30 ఏళ్ల కల సాకారం: మంత్రి దామోదర్

image

30, 40 ఏళ్ల కల నేడు సాకారం అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. 30 ఏళ్ల ఉద్యమానికి నేడు పరిష్కారం దొరికిందని మంత్రి తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వల్ల ఎవరి ప్రయోజనాలకు ఇబ్బంది ఉండదన్నారు. వర్గీకరణ వల్ల కొందరిలో భయం, అభద్రతాభావం కలుగుతోందని, వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు.

News February 5, 2025

మెదక్: సీఎంను సన్మానించిన మంత్రి

image

ఎస్సీ వర్గీకరణ అమలుపై రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎంను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు అమలు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని సీఎం వెల్లడించారు. ఎందరో ముఖ్యమంత్రులకు రాని అవకాశం నాకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

News February 4, 2025

సంగారెడ్డి: 8న సీనీ హీరోయిన్ రాక

image

ఈనెల 8న ఓ స్కూల్ 14వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రేఖ తెలిపారు. అమీన్ పూర్ మండలం బీరంగూడలోని ఓ స్కూల్‌లో జరిగే వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ‘సంక్రాంతి వస్తున్నాం’ ఫిలిం ఫేం, ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ రానున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు పాటలు, వివిధ రకాల నృత్య, నాటక, కరాటే ప్రదర్శనలు చేస్తారని అన్నారు.

News February 4, 2025

సిద్దిపేట: ‘తల్లీకూతుర్లు మృతి.. ఆదుకోండి’

image

గత నాలుగు రోజుల క్రితం అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా పనికి వెళ్లిన కూలీలపై మట్టి బండరాళ్లు విరిగిపడడంతో తల్లి-కూతుర్లు మృతి చెందారు. కొంతమంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి అని హుస్నాబాద్ ఆర్డీఓకు సిద్దిపేట జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్జీవో) పక్షాన వినతి పత్రం అందజేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.