Medak

News January 24, 2025

ప్రారంభమైన చిత్తారమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు

image

రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ చిత్తారమ్మ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు గణపతి పూజ, అమ్మవారికి ఘటాభిషేకం, కంకణ ధారణ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ, అంకురార్పణ, నిత్యబలిహారం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

News January 24, 2025

మాసాయిపేట: భార్య దూరంగా ఉంటుందని ఆత్మహత్య

image

అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిన ఒక వ్యక్తి గ్రామ శివారులో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాసాయిపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నర్సింహ చారి ఈనెల 21న అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గ్రామ శివారులో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే భార్య గత కొంత కాలంగా దూరంగా ఉండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఫిర్యాదు చేశారు.

News January 24, 2025

ఆందోల్: 10 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: మంత్రి దామోదర

image

ఆందోల్ మండలం నేరడిగుంటలో 10 రోజుల్లో ఇళ్ల నిర్మాణం చేపడతామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. నేరడిగుంట గ్రామసభలో 1994లో మహిళల అభివృద్ధి కోసం ఐదు రకాల భూమి కేటాయించామని, ఆ భూమిని ఇందిరమ్మ ఇండ్ల కోసం కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలోని పేదలందరికీ ఇళ్లు కేటాయిస్తామని మంత్రి పేర్కొన్నారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

News January 22, 2025

ఉమ్మడి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోహిర్ 6.9, అల్గోల్ 7.9, న్యాల్కల్ 8.7, అల్మాయిపేట 9.0, మల్చల్మ 9.6, కంకోల్, సత్వార్ 9.7, లక్ష్మీసాగర్ 9.8, దిగ్వాల్, బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీ 10.0, కంది 10.2, కంగ్టి, మొగుడంపల్లి 10.3, పుల్కల్, ఝరాసంఘం 10.4, అన్నసాగర్ 10.5, బోడగాట్ 10.7, కల్హేర్ 10.8, దామరంచ, పోతారెడ్డిపేట, చౌటకూరు, సిర్గాపూర్ 10.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

News January 22, 2025

రైల్వే ట్రాక్‌పై సిద్దిపేట అమ్మాయి తల, మొండెం (UPDATE)

image

HYD జామై ఉస్మానియాలో<<15212796>>అమ్మాయి సూసైడ్<<>> కేసులో అసలు విషయం వెలుగుచూసింది. కాచిగూడ రైల్వే పోలీసుల వివరాలు.. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతోంది. తన బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేస్తున్నట్లు అక్కకు తెలియడంతో భయపడింది. తల్లిదండ్రులకు చెబితే ఏమవుతుందోనన్న ఆందోళనతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఉస్మానియా మార్చురీలో బిడ్డను చూసిన పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలపించారు.

News January 22, 2025

సాంకేతికను అందిపుచ్చుకుందాం: కలెక్టర్ క్రాంతి

image

సాంకేతికను అందిపుచ్చుకుందామనిని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కందిలోని ఐఐటి హైదరాబాద్‌లో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతిక గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు. ఐఐటి హైదరాబాద్‌లో ఎన్నో ప్రయోగాత్మక పరిశోధన చేసి విజయం సాధించారని పేర్కొన్నారు. సమావేశంలో ఐఐటి డైరెక్టర్ మూర్తి పాల్గొన్నారు.

News January 22, 2025

గజ్వేల్‌లో ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలు

image

ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ గజ్వేల్‌లో ఈ నెల 23, 24 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కృష్ణారావు తెలిపారు. మెదక్ జిల్లా స్థాయి ఆటల పోటీల్లో 15 ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ విద్యార్థులు సుమారుగా 1200 మంది హాజరు అవుతారన్నారు. అతిథులుగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఏసీపీ పురుషోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హజరవుతారన్నారు.

News January 22, 2025

సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

image

మెదక్ జిల్లా SP కార్యాలయంలో జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో DSP సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో SP సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా సరే సైబర్ మోసానికి గురైతే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్, www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆశ, అత్యాశ సైబర్ నేరగాళ్ల ఆయుధాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పొద్దన్నారు.

News January 21, 2025

సంగారెడ్డి: టెన్త్ పరీక్షలు రాసేవారికి చివరి ఛాన్స్

image

ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు గడువు రేపటితో ముగియనుందని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. రూ.1000 అపరాధ రుసుంతో కలిపి రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు రేపటి వరకు చెల్లించాలన్నారు. ఇదే చివరి తేదీ అని, ఇక మీదట పొడిగింపు ఉండదని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

News January 21, 2025

ఖేడ్: గుండెపోటుతో 12ఏళ్ల బాలుడి మృతి

image

నారాయణఖేడ్‌లోని ఇందిరా కాలనీలో 12ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. జయమ్మ కొడుకు నితిన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు. కాగా మంగళవారం ఉదయం నిద్ర లేచిన నితిన్.. స్కూల్‌కి వెళ్లడానికి రెడీ అయ్యాడు. టీ బ్రెడ్ తాగిన అనంతరం శ్వాస సరిగ్గా రావట్లేదని తల్లికి చెప్పగా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడు. ఈ ఘటనలో  స్థానికులను కంటతడి పెట్టింది.

error: Content is protected !!