Medak

News January 27, 2026

MDK: అధికారులందరూ సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో 75 వార్డులుండగా
150 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉండాలన్నారు. నామినేషన్ పక్రియ నుంచి ఎన్నికలు పూర్తి అయ్యే వరకు అప్రమత్తంగా ఉండి, ఎన్నికల సంఘం నియమాల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించాలన్నారు.

News January 27, 2026

మెదక్: ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం మున్సిపల్ ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు.

News January 27, 2026

మెదక్: 4 మున్సిపాలిటీలు.. 87,615 మంది ఓటర్లు

image

మున్సిపల్ <<18974641>>ఎన్నికల నగారా<<>> మోగింది. మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో 75 వార్డులకు 150 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 87,615 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్-32 వార్డులు, 37,016 ఓటర్లు, రామాయంపేట-12 వార్డులు, 13,106 ఓటర్లు, నర్సాపూర్-15 వార్డులు, 17,066 ఓటర్లు, తుప్రాన్-16 వార్డులు 20,427 మంది ఓటర్లు ఉన్నారు. కాగా FEB 11న పోలింగ్, 13న ఫలితాలు.

News January 27, 2026

మెదక్ జిల్లాలో 51 మాంసాహార జంతువులు..!

image

మెదక్ జిల్లాలో వన్య ప్రాణుల లెక్క తేలింది. జిల్లాలోని 6 రేంజ్‌ల పరిధిలో 51 మాంసాహార జంతువులు గుర్తించినట్లు డీఎఫ్ఓ జోజి పేర్కొన్నారు. రేంజ్‌ల వారీగా మాంసాహార జంతువులు మెదక్-16, రామాయంపేట-9, తుప్రాన్-5, నర్సాపూర్-6, కౌడిపల్లి-12, పెద్దశంకరంపేట-3 ఉన్నట్లు తెలిపారు. సర్వేలో 71 మంది అటవీ సిబ్బంది, 143 మంది వాలంటీర్లు పాల్గొన్నారని చెప్పారు.

News January 26, 2026

మెదక్: ‘న్యాయం జరిగితేనే రాజ్యాంగానికి సార్ధకత’

image

ప్రతి బాధితుడికి న్యాయం జరిగితేనే రాజ్యాంగానికి సార్థకత అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలు, ఆశయాలకు లోబడి బాధ్యతాయుత పౌరులుగా జీవించాలన్నారు. మెదక్ క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. మాతృభూమి కోసం ఎందరో మహానీయులు తమ ప్రాణాలను త్యాగప్రాయంగా అర్పించిన ఫలితంగా మనకు భారత రాజ్యాంగం లభించిందని తెలిపారు.

News January 26, 2026

చేగుంట: వన్యప్రాణుల లెక్క తేలింది

image

చేగుంట మండలం ఇబ్రహీంపూర్ బీట్ పరిధి చిట్టోజి పల్లి అటవీ ప్రాంతంలో అఖిలభారత అటవీ జంతువుల గణన పూర్తయినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీత అగర్వాల్ తెలిపారు. పులులు, జింకలు, అడవి పందులు, నక్కలు, హైనా, కోతులు, కుందేళ్లు, ఉడుతలు, నెమళ్లు, అడవి కోళ్ళు, పావురాలు, గద్దలు, గుడ్లగూబలు, సర్పాలు, పాములు, ఉభయచర ఉనికి, సంఖ్య, సంచార మార్గాలను నమోదు చేసినట్లు తెలిపారు.

News January 25, 2026

పటాన్‌చెరులో యాక్సిడెంట్.. ఇద్దరు దుర్మరణం

image

పటాన్‌చెరు పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. ముత్తంగి జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టినట్లుగా సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 25, 2026

మెదక్: ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ వేటు

image

మెదక్ జిల్లా ప్రభుత్వ దవాఖానలోని పబ్లిక్ హెల్త్ డయాగ్నస్టిక్ ల్యాబ్‌ను ఆదివారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు గైర్హాజరైన ఇద్దరు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకున్నారు. అందులో ల్యాబ్ టెక్నీషియన్‌ను సస్పెండ్ చేయగా, మరొకరికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.

News January 25, 2026

ఉత్తమ స్వీప్ అధికారిగా రాజిరెడ్డికి పురస్కారం

image

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా సైన్స్ అధికారి(DSO) రాజిరెడ్డి ‘ఉత్తమ స్వీప్ అధికారి’గా ఎంపికయ్యారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించడంతో పాటు, పోలింగ్ శాతం పెంచడంలో ఆయన చేసిన కృషికి గాను కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా మెమెంటో, సర్టిఫికెట్ అందుకున్నారు. గతంలో ఓటర్ల నమోదు, ఆధార్ అనుసంధాన ప్రక్రియలో విశేష సేవలు అందించినందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి నుండి నగదు పురస్కారం కూడా పొందారు.

News January 25, 2026

ఇసుక అమ్ముకున్నది హరీశ్ రావే: మైనంపల్లి

image

సర్ధన, కొంగోడు ప్రాంతాల నుంచి ఇసుక అమ్ముకున్నది మాజీ మంత్రి హరీశ్ రావేనని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు ధ్వజమెత్తారు. ఆదివారం మెదక్‌లో పలువురు కాంగ్రెస్‌లో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్ రావు నాయకత్వంలో మెదక్ పట్టణ అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు.