India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టరేట్‌తో పాటు మున్సిపల్ ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి తాత్కాలిక వాయిదా వేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా యంత్రాంగం మొత్తం పురపాలక ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఎన్నికల జరుగు మున్సిపాలిటీ ఏరియాలలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.

తూప్రాన్ మున్సిపల్ పరిధిలో 16 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోనూ మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. తూప్రాన్ మున్సిపాలిటీ పీఠం జనరల్(ఆన్ రిజర్వుడ్) మహిళకు కేటాయించారు. దాంతో ఛైర్ పర్సన్ పీఠం ఆశిస్తున్న చాలామంది ఆశావాహులు మహిళలతో నామినేషన్లు దాఖలు చేయించారు. తూప్రాన్ మున్సిపాలిటీలో 50 శాతమే మహిళలకు రిజర్వ్ చేసినప్పటికీ అత్యధికంగా మహిళలు గెలుపొందనున్నారు.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేటి సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పటికే 70 శాతం అభ్యర్థులను ప్రకటించగా, మిగిలిన స్థానాల కోసం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒక్కో వార్డులో ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుండటంతో బీఫామ్ దక్కించుకునేందుకు అభ్యర్థులు పైస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో 312 నామినేషన్లు దాఖలయ్యాయి. గడువు ముగుస్తుండటంతో కార్యాలయాల వద్ద సందడి నెలకొంది.

రాయరావు వంశానికి ఆద్యుడైన నర్సన్న రాయరావు పేరు మీదనే ఈ గ్రామానికి ‘నర్సాపూర్’ అనే పేరు వచ్చింది. గోల్కొండ సంస్థానంలో 16వ శతాబ్దంలో సేనాపతిగా, రాజకీయ సలహాదారుగా, అత్యున్నత పదవులు చేపట్టిన మొట్టమొదటిది నర్సన్న రాయరావు. ఆయన పరిపాలనలో ఈ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చడానికి నీటి సరఫరా కోసం నిర్మించిన చెరువే ఇప్పటి రాయరావు చెరువు. యుద్ధ, రాజకీయ వ్యూహాల్లో మంచి అనుభవం గడించిన రాయరావులలో నర్సన్న మొదటి వారు.

ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని మెదక్ జిల్లా రవాణా శాఖాధికారి వెంకటస్వామి తెలిపారు. కార్లు, ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను షోరూంలోనే పూర్తి చేసుకునే కొత్త విధానం ఈ నెల 24 నుంచి జిల్లా వ్యాప్తంగా అమల్లోకి వచ్చిందన్నారు. మెదక్‌లోని ఓ షోరూంలో ఈ సేవలను ఆయన అధికారికంగా ప్రారంభించారు. సమయం ఆదా చేసే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రెండో రోజు నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. మొత్తం 269 మంది అభ్యర్థులు 286 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మెదక్‌లో 111, నర్సాపూర్‌లో 55, రామాయంపేటలో 52, తూప్రాన్‌లో 51 నామినేషన్లు అందాయి. పార్టీల వారీగా కాంగ్రెస్ 106, బీఆర్ఎస్ 96, బీజేపీ 51 చొప్పున పత్రాలు సమర్పించారు. నేడు స్వీకరణకు చివరి రోజు కావడంతో నామినేషన్ల భారీగా రానున్నాయని అధికారులు తెలిపారు.

మెదక్ జిల్లాలో గల నాలుగు పురపాలక సంఘాలలో మొదటి రోజు బుధవారం 26 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మెదక్-12, రామాయంపేట- 7 తూప్రాన్ – 4, నర్సాపూర్- 3 చొప్పున నామినేషన్లు సమర్పించారు. పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు మొదటి రోజు తమ ఇంటి పన్ను బకాయిలు, నల్లా పన్నుబకాయలు చెల్లిస్తూ నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకుంటూ నామినేషన్ పత్రాల కోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో తలమునకలయ్యారు.

Sorry, no posts matched your criteria.