Medak

News July 3, 2024

సిద్దిపేట: జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం

image

అటవీ హద్దులను నిర్ధారించుటకు, ఆక్రమణలను తొలగించుటకు ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 23,738 హెక్టార్ల అటవీ విస్తీర్ణం 77 ప్రాంతాలలో ఉందని అన్నారు.

News July 2, 2024

సంగారెడ్డి: 45 మంది ఉపాధ్యాయుల బదిలీ

image

సంగారెడ్డి జిల్లాలో 45 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. లాంగ్వేజ్ పండిట్ తెలుగు 11, హిందీ 22, ఉర్దూ 1, పీఈటీలు 11 మంది బదిలీ అయినట్లు చెప్పారు. బదిలీ అయిన ఉపాధ్యాయులు వారికి కేటాయించిన పాఠశాలలలో ఈ నెల 3వ తేదీన చేరాలని సూచించారు.

News July 2, 2024

NKD: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

image

మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నారాయణఖేడ్‌కు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. నారాయణఖేడ్ నుంచి కారులో వెళ్లిన రఫిక్ ఖురేషి, ఫెరోజ్ ఖురేషి, సయ్యద్ అమర్, మహబూబ్ ఖురేషి, ఫిరోజ్, సయ్యద్ ఇస్మాయిల్ పుణే సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 2, 2024

సంగారెడ్డిలో 4న జాబ్ మేళా

image

సంగారెడ్డిలోని బైపాస్ రహదారిలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 4న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి వందన తెలిపారు. ఐటీఐలో వెల్డర్, ఫిట్టర్, ఫ్యాబ్రికేషన్ చదివిన వారు అర్హులని చెప్పారు. 18 నుంచి 35 సంవత్సరంలోపు ఉన్న యువకులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వివరించారు.

News July 2, 2024

సిద్దిపేట: పదోన్నతుల్లో SGTలకు నిరాశ !

image

ఉపాధ్యాయుల పదోన్నతుల్లో అన్యాయం జరిగిందని SGTలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి సీనియారిటీ ప్రకారం ఇచ్చేవారని ప్రస్తుతం కోర్టు తీర్పు ప్రకారం బాషా పండితుల పదోన్నతులు ఉమ్మడి సీనియార్టీగా కాకుండా కేవలం పండితులకు ఇవ్వడంతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి సీనియారిటీని TTC చేసిన వారికి వర్తింపజేయడంతో బీఈడీ చేసిన ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు.

News July 2, 2024

పటాన్‌చెరు: కరెంట్ షాక్‌తో ఆటో డ్రైవర్ మృతి

image

కరెంట్ షాక్ తగిలి ఓ ఆటో డ్రైవర్ మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పటాన్‌చెరు మండలం క్యాసారం గ్రామంలో ఉంటున్న శ్రీనివాస్ గౌడ్(46) ఆటో డ్రైవర్. సోమవారం ఆటోను తడి బట్టతో శుభ్రం చేశాడు. అనంతరం దాన్ని వైరుపై ఆరేయగా షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 2, 2024

సిద్దిపేట: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు ఈనెల 15లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అనంతరం వాటి జీరాక్స్ ఈనెల 17లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

News July 2, 2024

సిద్దిపేట: ‘మాకు ఇచ్చే డబ్బులు మా పిల్లలకైనా ఇవ్వండి’

image

‘మాకు ఇచ్చే డబ్బులు మా పిల్లలకైనా ఇవ్వండి’ అంటూ చనిపోయిన తల్లిదండ్రుల పేరిట ఫ్లెక్సీని సిద్దిపేట జిల్లా దూళిమిట్టలో ఏర్పాటు చేశారు. కరుణాకర్-దివ్య దంపతులు వ్యవసాయం, కిరాణ షాపు నడుపుతూ జీవించేవారు. 4ఏళ్ల క్రితం కరెంట్ షాక్‌తో కరుణాకర్ చనిపోగా మనోవేదనతో దివ్య మృతితో పిల్లలు అనాథలయ్యారు. దీంతో షాపులో సరకులు ఉద్దెర, అప్పుగా తీసుకున్న డబ్బు ఇవ్వాలని పిల్లల పేరిట ఫ్లెక్సీని బాబాయ్ ఏర్పాటు చేశారు.

News July 2, 2024

ముగిసిన బదిలీలు, పదోన్నతులు

image

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సుదీర్ఘ విరామం తర్వాత పూర్తైంది. సంగారెడ్డి జిల్లాలో 915 మందికి పదోన్నతి దక్కగా.. 2267 మందికి స్థాన చలనం కలిగింది. సిద్దిపేట జిల్లాలోని మొత్తం 980 పాఠశాలల్లో 4136 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో 622 మందికి పదోన్నతి, 1032 మంది బదిలీ అయ్యారు. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందని DEOలు అన్నారు.

News July 2, 2024

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

మెదక్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు – 24కు హెచ్ఎం, టీచర్లు ఈనెల 10లోగా http://national award teachers, education. gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రాధాకిషన్ తెలిపారు. దరఖాస్తు ప్రతుల రెండు సెట్లను సంబంధిత యాజమాన్యాల ద్వారా ఈనెల 10వ తేదీలోగా డీఈవో కార్యాలయంలో అందజేయాలని సూచించారు.