India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన భువనగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లో గురువారం చోటుచేసుకుంది. మృతుడు భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఉడత వెంకటేష్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి నిర్ణయించారు. ప్రతి గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవల వేదిక (విలేజ్ టీం) ఇక్కడ వినతులు స్వీకరించనుంది. ప్రజావాణి నిర్వహణపై గ్రామంలో దండోరా వేయించడంతో పాటు కేబుల్ టీవీల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు.
పుట్టుకతోనే అంధురాలు.. కానీ 6ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది నల్గొండకి చెందిన పాలబిందెల శ్రీపూజిత. చదువు పూర్తి చేసి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యింది. 2022లో తొలి ప్రయత్నంలోనే నల్గొండ జిల్లా కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందింది. ఆ ఉద్యోగం చేస్తూనే.. గురుకుల లెక్చరర్ పరీక్షలకు సిద్ధమైంది. ఏప్రిల్‌లో వెల్లడైన గురుకుల ఫలితాల్లో ఏకంగా ఆరు ఉద్యోగాలు సాధించింది.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులను జూలై 1 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుండి విద్యాశాఖ కార్యక్రమాలపై విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతను అప్పజెప్పడం జరిగిందని అన్నారు.
శాలిగౌరారం ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్‌పై డీజీపీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. రిజిస్టర్ పోస్టు ద్వారా డీజీపీకి లేఖ పంపింది. ఫిర్యాదు చేయాడానికి స్టేషన్‌కి వెళితే తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపించింది.
తాను ఇప్పటికే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌కు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహరం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నల్గొండ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో అందరి సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. ప్రపంచ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో మాదకద్రవ్యాలకు యువత బానిసై జీవితాలను కోల్పోతున్న తరుణంలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
భార్య మృతికి కారణమైన భర్తను భువనగిరి ప్రధాన అసిస్టెంట్ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. నిందితుడికి ఐదేళ్ల శిక్షతోపాటు 2వేల జరిమాన విధిస్తూ జడ్జి వి.మాధవిలత మంగళవారం తీర్పు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లికి చెందిన వెంకటేశ్‌కు రాయగిరికి చెందిన శారదతో కొంతకాలం వివాహమైంది. అదనపు కట్నం కోసం వేధించగా మనస్తాపంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది.
జిల్లాలో మళ్లీ క్రైమ్ రేట్ పెరుగుతుంది. హత్యలు, దొంగతనాలు జాతీయ రహదారిపై దోపిడీలతో కొంతకాలంగా ప్రజలు భద్రత గాల్లో దీపంలా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. పట్టపగలే దొంగతనాలు జరుగుతున్నా.. రాత్రిపూట జాతీయ రహదారిపై దోపిడీలు జరుగుతున్నా పోలీసులు కనీస చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల NKP మండలం ఏపీ లింగోటం వద్ద, చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద దారి దోపిడీలు జరిగాయి.
మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి స్వయం సహాయక సంఘాలు చెల్లించిన రుణాలకు వడ్డీని తిరిగి వారి ఖాతాలో జమ చేసింది. అందులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.273.55 కోట్లను మహిళా సంఘాల ఖాతాల్లో వేశారు. అతివలు ఆర్థికంగా ఎదగడానికి స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ద్వారా ఏటా ప్రణాళిక ప్రకారం రుణాలు అందిస్తుంది.
ఉమ్మడి జిల్లాలో రాను రాను చిరుధాన్యాల సాగు తగ్గిపోతున్నది. కందులు మినహా ఇతర పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. సాగు లాభదాయకంగా ఉన్నా సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడం, మార్కెట్లలోనూ మద్దతు లేకపోవడం తదితర కారణాల వల్ల రైతులు వీటివైపు మొగ్గు చూపడం లేదని తెలుస్తుంది. ప్రస్తుత రబీ సీజన్లో ఉమ్మడి జిల్లాలో కందులు 3940, ఇతర పప్పు దినుసులు 1578 ఎకరాల్లో మాత్రమే సాగు చేనున్నట్లు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.