Nalgonda

News January 3, 2026

NLG: జానారెడ్డిని పరామర్శించిన మండలి చైర్మన్ గుత్తా

image

మాజీ మంత్రి జానారెడ్డిని శనివారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న జానారెడ్డి ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

News January 3, 2026

నల్గొండ: ఓటరు జాబితా సవరణలో వేగం పెంచాలి: ​కలెక్టర్

image

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నిర్దేశించిన రోజువారీ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులు ప్రతిరోజూ కనీసం 40 ఎంట్రీలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

News January 3, 2026

నల్లగొండలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు

image

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వాల్ పోస్టర్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు మానవ నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనే కారణమని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, “నో హెల్మెట్ – నో పెట్రోల్” నినాదాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని తెలిపారు.

News January 3, 2026

NLG: మంత్రి కోమటిరెడ్డికి అల్లు అరవింద్‌ శుభాకాంక్షలు

image

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ సాగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు పూర్తి అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.

News January 3, 2026

NLG: నకిలీ బంగారం ముఠా గుట్టురట్టు.. నిందితుల అరెస్ట్

image

తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ అమాయకులను నమ్మించి మోసగిస్తున్న ఏడుగురి అంతరాష్ట్ర సభ్యుల ముఠాను నల్గొండ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ కె.శివరాం తెలిపారు. వారి నుంచి రూ.1.5 లక్షల నగదు, 5 సెల్‌ఫోన్లు, అరకేజీ నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

News January 3, 2026

NLG: నీటి వాటాలో ‘తెలంగాణ’కు ద్రోహం: మంత్రి ఉత్తమ్

image

కృష్ణ, గోదావరి జలాల పంపిణీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను పనంగా పెట్టిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే జలాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, చుక్క నీటిని కూడా బయటకు పోనివ్వబోమని స్పష్టం చేశారు.

News January 3, 2026

కేసీఆర్ వదిలిన రాజకీయ బాణం కవిత: కోమటిరెడ్డి

image

మాజీ సీఎం కేసీఆర్ వదిలిన రాజకీయ బాణంగా కవిత వ్యవహరిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న నేతలను దూరం చేసేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. కవిత అసలు బీఆర్‌ఎస్‌లో ఉన్నారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌పై విమర్శలకే స్పందిస్తున్న ఆమె.. హరీశ్‌రావుపై వస్తున్న ఆరోపణల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని మంత్రి ప్రశ్నించారు.

News January 3, 2026

NLG: టీచర్లకు పరీక్ష.. విద్యార్థులకు బోధన ఎలా?

image

జిల్లా కేంద్రంలో రేపటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. టెట్ రాసేందుకు చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఫీజు కట్టారు. కొంతమంది వచ్చే విడతలో చెల్లించి రాయాలని చూస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. టెట్ పరీక్ష రోజున ఉపాధ్యాయులందరూ స్కూల్‌ను విడిచి వెళ్లే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వేర్వేరు తేదీల్లో 6 రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. 1,557 మంది ఉపాధ్యాయులు పరీక్షలకు వెళ్లనున్నారు.

News January 3, 2026

NLG: తొలగిన కష్టాలు.. పెరిగిన యూరియా కొనుగోళ్లు

image

జిల్లాలో యూరియా యాప్ ద్వారా బుకింగ్ విజయవంతంగా సాగుతుంది. యాప్ ప్రారంభంలో తొలి 2 రోజులు రైతులు ఇబ్బందులకు గురయ్యారు. ఆ తర్వాత యాప్ బుకింగ్ లో సమస్యలు తొలగిపోవడంతో రైతులకు పారదర్శకంగా యూరియా అందుతుంది. పది రోజుల్లో జిల్లాలో 34,579 మంది రైతులు లక్షకు పైగా యూరియా బస్తాలు కొనుగోలు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు.

News January 3, 2026

NLG: రేపటి నుంచి టెట్ పరీక్షలు షురూ

image

ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టెట్) ఈనెల 4 నుంచి ప్రారంభం కానున్నాయి. 6 రోజుల పాటు జరిగే పరీక్షల నిర్వహణ కోసం నల్గొండ పట్టణంలోని ఎస్పీఆర్ స్కూల్లో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 4, 8, 9, 11, 19, 20 తేదీల్లో టెట్ పరీక్షలు జరుగనున్నాయి. 1,557 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి.