India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పురపాలక ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని, స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లతో రానున్న మున్సిపల్ ఎన్నికలపై సంసిద్ధత సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికలకు ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు చురుకుగా వ్యవహరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ఆయన శుక్రవారం తన ఛాంబర్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల పాత్ర ముఖ్యమని, ముఖ్యంగా ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు కచ్చితమైన పరిష్కారం అందించాలని సూచించారు.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో ఎస్పీ మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని పలు అంశాలపై వారు క్లుప్తంగా చర్చించుకున్నారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొని కలెక్టర్‌కు అభినందనలు తెలియజేశారు.

చలికాలంలో పొగమంచు కారణంగా రహదారి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. దృశ్యమానత తక్కువగా ఉన్నప్పుడు అతివేగం, ఓవర్‌టేకింగ్‌లకు దూరంగా ఉండాలని కోరారు. వాహనాలకు తప్పనిసరిగా ఫాగ్ లైట్లు వాడాలని, ముందు వాహనానికి సురక్షిత దూరం పాటించాలని తెలిపారు. నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. మితిమీరిన వేగం, అజాగ్రత్త ప్రాణాంతకమని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు గౌరవించి, రహదారి భద్రతను సామాజిక బాధ్యతగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు.

జిల్లా ఆసుపత్రిలోని పీఆర్‌టీ కేంద్రంలో అత్యాధునిక డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌రే పరికరాన్ని అధికారులు ప్రారంభించారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. నెల రోజుల పాటు కొనసాగే ఈ ప్రత్యేక క్యాంపును ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అత్యాధునిక సాంకేతికతతో క్షయ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం సులువవుతుందని పేర్కొన్నారు.

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. ఉదయం 9 గంటల వరకు పొగ మంచు కురుస్తూనే ఉండడంతో ప్రధాన రహదారుల మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్తున్నారు. గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండడం.. వాతావరణం చల్లగా ఉండడంతో అటు ప్రజలు.. ఇటు స్కూల్ చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.

రిజర్వేషన్లు-నామినేషన్లకు మధ్యలో సమయం ఉండే అవకాశం లేకపోవడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వార్డులవారీగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. రిజర్వేషన్ అనుకూలించినా లేకపోయినా ముందు జాగ్రత్తగా ప్రతీవార్డుకు కులాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు వార్డుల వారీగా ఆశావాహుల జాబితా రూపొందించే పనిలో పడ్డాయి

రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని నూతన కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఈ రోజు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ నూతన కలెక్టర్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపి, ఆల్ ది బెస్ట్ చెప్పారు.

నల్గొండ జిల్లాలో కొత్తగా ఏర్పడిన 25 గ్రామ పంచాయతీల్లో కొత్తగా బ్యాంక్ అకౌంట్లు తెరవాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం మూడు అకౌంట్లు తెరవాల్సి ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం నిధులకు ఒక అకౌంట్, రాష్ట్ర ప్రణాళిక సంఘం నిధులకు మరో అకౌంట్‌తో పాటు గ్రామపంచాయతీ నిధులకు సంబంధించి మూడో అకౌంట్ తీయాలని ఉత్తర్వులు ఇవ్వడంతో కొత్త పంచాయతీల్లో కొత్త అకౌంట్లు తెరిచారు.
Sorry, no posts matched your criteria.