India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బోర్‌వెల్ లారీ పైనుంచి పడి కార్మికుడు మృతి చెందిన ఘటన మిర్యాలగూడలో జరిగింది. ఎస్సై నరేష్ వివరాల ప్రకారం.. చత్తీస్‌గఢ్‌కు చెందిన బోటి రామ్ భగేల్ చింతపల్లిలో నివాసం ఉంటూ బోర్‌వెల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బోర్ వేయడానికి వెళ్తుండగా లారీ పైనుంచి పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అన్న భువనేశ్వర్ భగేల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నకిలి బంగారంతో రూ.53.89 లక్షల రుణం తీసుకున్న ఏడుగురు నిందితులను, సహకరించిన గోల్డ్ అప్రజయిర్‌ను హుజూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్డుకు రిమాండ్ చేశారు. సీఐ చరమంద రాజు తెలిపిన వివరాలిలా.. నేరేడుచర్ల మండలం వైకుంఠపురానికి రాజేశ్ మిర్యాలగూడలో బంగారం దుకాణాన్ని పెట్టాడు. నష్టం రావడంతో అప్పులు తీర్చేందుకు నకిలీ ఆభరణాలు తయారు చేయించి మిత్రులతో కలిసి భారీ మొత్తంలో లోన్ తీసుకున్నాడు.
ఢిల్లీ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. తెలంగాణ బిడ్డ కేంద్ర మంత్రిగా పదవి చేపట్టిన సందర్భంగా పార్టీలకు అతీతంగా సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సత్కరించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రిని వారు కోరారు.
నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు మంగళవారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.30 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 122.1967 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్‌లో 800 క్యూసెక్కులుగా ఉంది.
పొడి దుక్కుల్లో విత్తనాలు వేసిన రైతుల ఆశలు మొలకెత్తుతున్నాయి. మొలిచిన పత్తి మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. సోమవారం 16 మండలాల్లో 2.0 మి.మీ వర్షం కురిసింది. 4 రోజులుగా నల్గొండ జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో పంటల సాగుకు అనుకూలమైన వర్షం పడటంతో పత్తి విత్తనాలు వేసిన రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ వ్యవసాయ శాఖ అంచనా మేర 2 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు.
డబ్బు రెట్టింపు చేస్తామని ఓ వ్యక్తిని సొంత బంధువులే మోసం చేశారు. NLG మండలం చందనపల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు చారిని అతడి సమీప బంధువులు నమ్మించారు. ఇది నమ్మిన చారి వారికి మొదటగా రూ.2 లక్షలు ఇస్తే వారు రూ.4లక్షలు తిరిగి ఇచ్చారు. దీంతో ఆర్ఎంపీ వైద్యుడు వారికి రూ.33లక్షలు ఇవ్వగా.. రూ.66 లక్షలు ఇస్తామని చెప్పి రెండు అసలు నోట్ల మధ్యలో తెల్ల కాగితాలు పెట్టి ఇచ్చారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డిఎస్పి రాజశేఖర్ రాజు వివరాలు.. మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్‌కు చెందిన అశోక్ ఓ గిరిజన మహిళపై గత కొద్దిరోజులుగా భయపెట్టి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అంతే కాకుండా వీడియోలు తీసి ఆమె భర్తకు పంపిస్తానని బెదిరిస్తుండటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఢిల్లీలో కేంద్ర జాతీయ రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కారణంగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్- విజయవాడ ఆరు లైన్ల జాతీయ రహదారి పనులను పునర్ ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. భువనగిరి మండలంలోని చీమల కొండూరు గ్రామానికి చెందిన మహేష్ వ్యవసాయ కూలీల పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన మహేష్ తన వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గొర్రెల కాపరులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నల్గొండ జిల్లాలో అర్హులందరికీ గృహ జ్యోతి పథకం అందట్లేదు. అర్హత ఉన్నా 200యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ దరఖాస్తుల్లో పొరపాట్లను చూపుతూ అధికారులు వేలాది మందిని గృహజ్యోతికి అనర్హులను చేశారు. ఉచిత విద్యుత్‌కు 2.80లక్షల దరఖాస్తులు చేయగా.. పొరపాట్లతో 2.07లక్షల మందికి వర్తింప చేస్తున్నారు. మొదట రేషన్, ఆధార్ ఆధారంగా దరఖాస్తు చేసుకోమనగా.. పేద, మధ్యతరగతి ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.