Nalgonda

News April 12, 2026

కీడు తొలగాలని.. ‘వనవాసం’ వెళ్లిన ఊరు

image

కట్టంగూర్ గ్రామానికి పట్టిన పీడ విరగడ కావాలని, ఊరిపై ఉన్న కీడు తొలగిపోవాలని కోరుకుంటూ కట్టంగూరు గ్రామస్థులు సామూహికంగా ‘వనవాసం’ నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం.. ఊరు ఊరంతా ఖాళీ చేసి అడవి ప్రాంతానికి తరలివెళ్లారు. ఉదయాన్నే ఇళ్లకు తాళాలు వేసి వంట సామగ్రితో సహా ఊరి శివారులోని తోటలు, ఖాళీ ప్రదేశాలకు చేరుకున్నారు. అక్కడ సామూహిక వంటలు చేస్తున్నారు.

News April 12, 2026

నల్గొండ: గ్యాస్ సెగలు: సామాన్యుడిపై ధరల భారం!

image

నల్గొండ జిల్లాలో వాణిజ్య సిలిండర్ల కొరతతో హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. గ్యాస్ దొరక్క హోటల్ యజమానులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తుండగా, ఇడ్లీ, దోశల ధరలు రూ.10 వరకు పెరిగాయి. మరోవైపు గృహ వినియోగ సిలిండర్ల సరఫరాలోనూ జాప్యం జరుగుతోంది. బ్లాక్ మార్కెట్ దందాతో ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.

నల్గొండ: కొనుగోలు కేంద్రాలకు పోటెత్తిన ధాన్యం

image

నల్గొండ జిల్లావ్యాప్తంగా రబీ ధాన్యం రాశులు కొనుగోలు కేంద్రాలకు పోటెత్తాయి. ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో సుమారు 140 కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, పలుచోట్ల కొనుగోళ్లు ఇంకా పట్టాలెక్కలేదు. అకాల వర్షాల భయం, నిల్వ సౌకర్యం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ధాన్యం సేకరణను ప్రారంభించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

News April 12, 2026

MLG: విద్యుత్ షాక్‌తో మహిళా రైతు మృతి

image

మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడులో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఎదురుగట్ల శంకరమ్మ (35) అనే మహిళ మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శంకరమ్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

News April 12, 2026

నల్గొండ: తప్పు ఒకరిదైతే శిక్ష మరొకరికి..!

image

మహాత్మాగాంధీ వర్సిటీ అవుట్‌సోర్సింగ్ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏజెన్సీ నిర్వాహకులు సకాలంలో జీఎస్టీ చెల్లించకపోవడంతో అధికారులు వేతనాలను నిలిపివేశారు. ఫలితంగా 113 మంది చిరుద్యోగులు రెండు నెలలుగా జీతాల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. అధికారుల పర్యవేక్షణ లోపం, ఏజెన్సీ నిర్వాహకుల బాధ్యతారాహిత్యం మధ్య సామాన్య కార్మికులు బలిపశువులవుతున్నారు.

News April 11, 2026

నల్గొండలో ప్రత్యేక డీ-అడిక్షన్ సెంటర్: కలెక్టర్

image

మత్తు పదార్థాలకు బానిసైన వారికి మెరుగైన చికిత్స అందించి, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో త్వరలోనే అత్యాధునిక వసతులతో కూడిన ప్రత్యేక డీ-అడిక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.