India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వనపర్తిలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 రాష్ట్ర స్థాయి హాకీ బాలుర పోటీలలో నల్గొండ జిల్లా జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో హైదరాబాద్ జట్టును 3-2 గోల్స్ తేడాతో ఓడించింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో నల్గొండ జట్టు మహబూబ్‌నగర్ జట్టుతో తలపడనుంది. జట్టు ప్రదర్శన పట్ల కార్యదర్శి విమల, హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమామ్ కరీం హర్షం వ్యక్తం చేశారు.

మహాత్మా గాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి 500 కోట్లు మంజూరు చేయాలని గురువారం విద్యార్థులు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం ప్రకటించిన 1000 కోట్లు స్వాగతించదగ్గదేనిగానీ, ఎంజియు 20 ఏళ్లుగా పీజీ సెంటర్ స్థాయిలోనే ఉందని పేర్కొన్నారు. సిబ్బంది కొరత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దుర్దశ, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల భారీ ఫీజులు, పరిశోధనలో వెనుకబాటు సమస్యలను పరిష్కరించాలని అన్నారు.

తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన ఊట్కూరి వాణి సందీప్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ బలపరిచిన మామిడి నాగలక్ష్మిపై 459 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఘన విజయంతో సర్పంచ్ మద్దతుదారులు గ్రామంలో బాణసంచా కాల్చి, డప్పుల మోతతో సంబరాలు నిర్వహించారు.

అంతయ్యగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన కన్నెబోయిన లక్ష్మయ్య విజయం సాధించారు. ఆయన తన సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి బ్రహ్మచారిపై 21 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సందర్భంగా సర్పంచ్ మద్దతుదారులు బాణసంచా కాల్చి, డప్పు వాయిద్యాలతో సంబరాలు చేసుకున్నారు.

MGU పరిధిలో నిర్వహించనున్న పీజీ (MA, M.Com, M.Sc, M.S.W) సెమిస్టర్-3 రెగ్యులర్ పరీక్షల టైం టేబుల్‌ను డా.ఉపేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల జనవరి 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. సంబంధిత టైం టేబుల్‌ను విద్యార్థులు విశ్వవిద్యాలయం వెబ్సైట్లో చూసుకోవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ తేదీలను గమనించాలని కోరారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనేందుకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున పల్లె బాట పట్టారు. పట్నం ప్రజలు సొంతూళ్లకు తరలిరావడంతో చౌటుప్పల్ వద్ద హైవేపై భారీగా వాహనాలు బారులు తీరాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాల్లో జనం సొంతూళ్లకు పయనమయ్యారు. ఉదయం 9 గంటల వరకు 19.58 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

జిల్లాలోని 14 పాఠశాలల్లో బాలికలకు కరాటే నేర్పించడానికి ఆసక్తి, కరాటే బ్లాక్ బెల్ట్ కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి మహ్మద్ అక్బర్ అలీ తెలిపారు. కరాటే బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్లు, పూర్తి బయోడేటాతో ఈనెల 15లోగా నగొండలోని యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపికైన వారికి నెలకు రూ.5 వేల చొప్పున పారితోషికం ఇస్తామన్నారు.

డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (BA, B.Com, Bsc) I, III, V సెమిస్టర్ల ఫీజును డిసెంబర్ 27 తేదీ లోపు చెల్లించాలని ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ తెలిపారు. Bsc విద్యార్థులు, BCom కంప్యూటర్స్ విద్యార్థులు థియరీ పరీక్షలతో పాటు ప్రాక్టికల్స్‌కు రిజిస్ట్రేషన్ చేయించి ఫీజు చెల్లించాలన్నారు. వివరాల కోసం విద్యార్థులు స్టడీ సెంటర్లలో సంప్రదించాలన్నారు.

నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చిట్యాల మండలంలో 18 జీపీల్లో మొదటి దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉ.గం. 7 గంటల నుంచి మ.1 వరకు ఎన్నికలు జరగనుండగా మొదటి గంటలో అంతగా ఓటర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకోలేదు. మండలంలోని 180 పోలింగ్ కేంద్రాల్లో 35,735 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సర్పంచ్ అభ్యర్థులుగా 56 మంది పోటీలో ఉన్నారు.

మొదటి విడత పోలింగ్ జరగనున్న కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. బుధవారం పోలీస్ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని సూచించారు. ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.
Sorry, no posts matched your criteria.