Nalgonda

News April 17, 2026

NLG: రేషన్ సమస్యలు.. రెండు రోజుల్లో పరిష్కారం

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిల్వలు ముగిసి రేషన్ దుకాణాలు మూతపడుతున్నాయన్న వార్తలపై జిల్లా పౌరసరఫరాల అధికారులు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ కోటా కింద NLGతో పాటు KMM, మహబూబాబాద్ జిల్లాలకు ప్రభుత్వం ఇప్పటికే బియ్యం కేటాయించిందని, అందులో సగం రవాణా పూర్తయిందని తెలిపారు. మరో రెండు రోజుల్లో రవాణా ప్రక్రియను పూర్తిస్థాయిలో ముగించి, నిల్వలు లేక మూతపడిన దుకాణాలకు బియ్యాన్ని చేరవేస్తామన్నారు.

News April 17, 2026

ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరం: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. శుక్రవారం MLGలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాలలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది ఒక్క మిర్యాలగూడ డివిజన్ పరిధిలోనే 93 మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని ఎస్పీ పిలుపునిచ్చారు.

News April 17, 2026

మిల్లర్లు రైతులకు అండగా నిలవాలి: కలెక్టర్

image

నల్లగొండ జిల్లాలో రబీ ధాన్యం సేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, మిల్లులకు వస్తున్న ధాన్యాన్ని ఏమాత్రం జాప్యం చేయకుండా అన్ లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మిల్లర్లు, సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యం లోడుతో మిల్లుల వద్ద లారీలు పడిగాపులు కాయకూడదని అన్నారు.

News April 16, 2026

NLG: లక్ష్యం దిశగా రబీ కొనుగోళ్లు..

image

NLG జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 5,512 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఇప్పటివరకు జరిగిన మొత్తం కొనుగోళ్లు 36,360 మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. సేకరించిన ధాన్యంలో 36,298 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 62 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం ఉంది. ఈ కొనుగోళ్ల ద్వారా ఇప్పటివరకు 4,112 మంది రైతులు లబ్ధి పొందారు.

News April 16, 2026

NLG: పాడి గేదెల పథకానికి లాస్ట్ డేట్ ఇదే

image

నల్గొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం (ఎస్సీ కార్పొరేషన్) ద్వారా అమలు చేస్తున్న 2 పాడి గేదెల పథకం దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. 70 శాతం సబ్సిడీతో కూడిన ఈ పథకానికి అర్హులైన ఎస్సీ అభ్యర్థులు OBMMS వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

నల్గొండ జిల్లా జడ్జిగా వసంత్‌ పాటిల్‌ బాధ్యతలు

image

నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వసంత్‌ పాటిల్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కొత్తగూడెం నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు జిల్లా కోర్టు సముదాయంలో న్యాయవాదులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందేలా చూస్తానని తెలిపారు.

ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచాలి: కలెక్టర్

image

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 100 శాతం ఫలితాల సాధనకు ప్రిన్సిపల్స్, అధ్యాపకులు చిత్తశుద్ధితో కృషి చేయాలని నల్గొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్ ఫలితాల్లో వెనుకబడిన విద్యార్థుల కోసం ఈనెల 17 నుంచి రెమిడీయల్ తరగతులు నిర్వహించి, సప్లమెంటరీలో వారు రాణించేలా చూడాలన్నారు.