India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సాగర్‌లో ఎండల తీవ్రతకు నీరు ఆవిరైపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్, మేలో రోజుకు సుమారు 250 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో నష్టపోతున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన మరో 2 నెలల్లో 12,500 క్యూసెక్కుల నీరు వృథా అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నీటిమట్టం డెడ్ స్టోరేజ్ (510 అడుగులు) కంటే కేవలం 16 అడుగులే ఎగువన ఉండటంతో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

మహిళా రిజర్వేషన్ల అంశంపై బీజేపీ ద్వంద్వ విధానాలను అవలంబిస్తోందని డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాశ్ నేత ధ్వజమెత్తారు. 40 ఏళ్ల బీజేపీ చరిత్రలో ఒక్క మహిళకైనా జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం వెనుక దక్షిణాది రాష్ట్రాల ప్రయారిటీని తగ్గించే కుట్ర ఉందన్నారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లో డిజిటల్ సేవలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్‌ఫోన్లు లబ్ధిదారులకు అందకుండా కార్యాలయాలకే పరిమితమయ్యాయి. జిల్లాలోని 2,093 కేంద్రాల్లో బాలింతలు, చిన్నారుల పౌష్టికాహార వివరాలను ఆన్‌లైన్ చేయాల్సి ఉన్నా.. ఫోన్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు మండలానికి ఒకరిద్దరికి మాత్రమే మొబైల్స్ అందించి, మిగిలినవి అటకెక్కిండంపై అంగన్వాడీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో తలా ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మంజూరైనట్లు కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. నల్గొండ (దోమలపల్లి), మునుగోడు (చండూరు), నాగార్జునసాగర్ (పెద్దవూర)తో పాటు నకిరేకల్, మిర్యాలగూడ, దేవరకొండ పాఠశాలలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. కార్పొరేట్ స్థాయిలో తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా మైదానాలను అభివృద్ధి చేయనున్నారరు.

రైలు కింద పడి ఓ గుర్తుతెలియని మహిళ(55) ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం రాత్రి చిట్యాల – శ్రీరాంపురం మధ్య గోపలాయపల్లి వద్ద చోటుచేసుకుంది. సికింద్రాబాద్ – హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ కింద పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్టేషన్ మాస్టర్ అభినవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లగొండ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు 87126 58595 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 21న నల్గొండలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో (ఐటిఐ క్యాంపస్) ‘మినీ జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎస్. పద్మ తెలిపారు. ఈ మేళాకు SSC, ఇంటర్, ఏదైనా డిగ్రీ చదివిన 18-30 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులు. ఎంపికైన వారికి హైదరాబాద్, నల్గొండ పరిసర ప్రాంతాల్లో రూ. 10,000 నుంచి రూ. 20,000 వరకు వేతనం ఉంటుందని తెలిపారు.

జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 60,389 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో 60,221 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 168 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం సేకరించారు. ఈ ప్రక్రియ ద్వారా 7,077 మంది రైతులకు లబ్ధి చేకూరింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 444 కొనుగోలు కేంద్రాలకు గాను, ప్రస్తుతం 373 కేంద్రాలు పనిచేస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.