Nalgonda

News April 25, 2025

NLG: ఒకే తరహా ఘటనలు.. చర్యల్లో వివక్ష!

image

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు ఘటనల్లో అధికారులు చర్యలు తీసుకోవడంలో వివక్ష చూపుతున్నట్లు తెలుస్తుందని పలువురు అంటున్నారు. KTR (మం) చెరువుఅన్నారంలో 6.18 గుంటల భూమిని DT సుకన్య ఇతరులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వ్యవహారంలో సుకన్యను కలెక్టరేట్‌కు అటాచ్ చేశారే తప్ప చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. HZNRలో పట్టా మార్పిడి విషయంలో మాత్రం తహశీల్దార్ జయశ్రీని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

News April 25, 2025

మిర్యాలగూడ: పెళ్లి కావడం లేదని యువకుడి సూసైడ్

image

పెళ్లి కావడం లేదని బాధతో యువకుడు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మిర్యాలగూడ రైల్వే ఎస్ఐ బి.సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్ నగర్ బంధంకు చెందిన చల్లా కళ్యాణ్ పెళ్లి కావడం లేదని కొంత కాలంగా బాధపడుతున్నాడు. బుధవారం బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చిన తరువాత మనస్తాపంతో గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

News April 25, 2025

మిర్యాలగూడలో భారీ అగ్నిప్రమాదం

image

మిర్యాలగూడ – సాగర్ రోడ్డులో ఉన్న న్యూ విజయలక్ష్మి టైర్ రీట్రేడింగ్ వర్క్స్‌లో నిప్పు అంటుకొని భారీ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాలను పొగ కమ్మేసింది. ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

News April 25, 2025

NLG: ఏడాది నుంచి ఎదురుచూపులే..!

image

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన మాతా శిశు ఆరోగ్య (MCH) కిట్ల పంపిణీ నిలిచిపోయింది. దీంతో పాటు గర్భిణులు, బాలింతలకు అందించే ప్రోత్సాహకాలు కూడా బందయ్యాయి. అలాగే గర్భిణులకు న్యూట్రీషన్ కిట్ల సరఫరా కూడా నిలిచిపోయింది. కిట్లతోపాటు ప్రోత్సాహక నిధులు గతేడాది మార్చి నుంచి రావడంలేదని మహిళలు తెలిపారు. ప్రభుత్వ స్పందించి కిట్లతో పాటు ప్రోత్సాహకాలు అందించాలన్నారు.

News April 24, 2025

కట్టంగూరు డీటీపై బదిలీ వేటు

image

కట్టంగూరు డీటీ జే.సుకన్యపై బదిలీ వేటు పడింది. అన్నారంలోని రామ్మూర్తి అనే రైతుభూమిని ఆమె వేరే వారి పేరు మీద బదిలీ చేసింది. బాధితుడు రామ్మూర్తి ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపారు. తప్పు తేలడంతో డీటీపై చర్యలు తీసుకున్నారు. సుకన్యను నల్గొండ కలెక్టరేట్‌కు అటాచ్ చేశారు.

News April 24, 2025

NLG: రిసోర్స్ పర్సన్స్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు మండల, జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్ల కోసం అర్హత, ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈ నెల 24న దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. ఎంపికైన వారి వివరాలు ఈ నెల 28న ప్రకటిస్తామని పేర్కొన్నారు. వివరాలకు క్వాలిటీ కోఆర్డినేటర్ ఆర్.రామచంద్రయ్యను, సెల్ నంబర్ 79955 67558ను సంప్రదించాలని సూచించారు.

News April 24, 2025

రాష్ట్రంలో 10,590 మంది గ్రామ పాలన అధికారులు

image

భూముల రికార్డులను సక్రమంగా నిర్వహించడం, వివాదాలను తగ్గించేందుకు ప్రతి గ్రామానికి ఒక గ్రామ పాలన అధికారిని ప్రభుత్వం నియమిస్తుందని కలెక్టర్ త్రిపాఠి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 10,590 మంది గ్రామ పాలన అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. గురువారం మునుగోడులో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. సర్వే సమస్యల పరిష్కారానికి 6000 మంది లైసెన్సుడ్ సర్వేయర్లను నియమించబోతుందని వెల్లడించారు.

News April 24, 2025

NLG: ప్రభుత్వ కాలేజీల్లో తగ్గుతున్న ఫలితాలు

image

ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. జిల్లాలో 12 జూనియర్ కళాశాలలు ఉండగా నాంపల్లి 85.71, చింతపల్లి 76.92, హిల్ కాలనీ 66.91, దేవరకొండ (బాలికలు) 58.33 శాతం ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన కాలేజీల్లో 50 శాతం లోపే ఉత్తీర్ణత రాగా, అతి తక్కువగా నకిరేకల్ కళాశాలలో 26.8 శాతం ఫలితాలు వచ్చాయి. ఫలితాలు తగ్గడానికి విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోవడమే కారణమని అధ్యాపకులు భావిస్తున్నారు.

News April 24, 2025

NLG: టీపీసీసీ పరిశీలకుల నియామకం!

image

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాకు పరిశీలకులను నియమించింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాకు మక్తల్ ఎమ్మెల్యే వి.శ్రీహరి ముదిరాజ్, నజీర్ అహ్మద్‌ను పరిశీలకులుగా నియమించింది. వీరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షులను కొనసాగించాలా..? లేక కొత్తవారిని నియమించాలా..? అనే దానిపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించి అధిష్ఠానానికి నివేదిక సమర్పించనున్నారు.

News April 24, 2025

NLG: రజతోత్సవం పైనే బీఆర్ఎస్ నజర్

image

వరంగల్ సభను బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈనెల 27న జరిగే పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నుంచి లక్ష మందిని తరలించేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. వరంగల్‌కు సమీప నియోజకవర్గాలైన ఆలేరు, భువనగిరి, సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల నుంచి 12,500 మంది చొప్పున 50 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పార్టీ నేతలు తెలిపారు.