India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం జిల్లాకు విచ్చేయనున్న త్రిపుర గవర్నర్‌కు స్వాగతం పలికి, అనంతరం పలు అభివృద్ధి పనుల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు తిప్పర్తి మండల కేంద్రంలో జరగనున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభకు హాజరై, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మీసేవ సేవల ధరలను ప్రభుత్వం భారీగా పెంచింది. కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం, సవరించిన ఛార్జీలు తక్షణమే అమలులోకి వస్తాయి. ‘ఏ’ కేటగిరీ సేవలు రూ. 62కి, ‘బి’ కేటగిరీ సేవలు రూ. 80కి పెరిగాయి. విద్యుత్ బిల్లుల చెల్లింపులపై కూడా స్లాబుల వారీగా రూ. 4 నుంచి రూ. 44 వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఈ పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులు జాప్యంతో సాగుతున్నాయి. గంధంవారిగూడెంలో ఒక బ్లాక్ మినహా మిగిలినవి ప్రాథమిక దశలోనే ఉన్నాయి. మునుగోడు, గడ్డిపల్లి, చిలుకూరు, తుర్కపల్లిలో నిర్మాణాలు ఆరంభంలోనే ఉండగా, నకిరేకల్‌లో స్థలసేకరణ మాత్రమే పూర్తయింది. సాగర్, DVK, MLGలో అసంపూర్తిగా ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరానికి స్కూళ్లు సిద్ధం కావడం కష్టంగానే ఉంది.

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.

సర్పంచులు బాధ్యతలు స్వీకరించి వంద రోజులు పూర్తయినా ఇప్పటివరకు గౌరవ వేతనం అందలేదు. జిల్లాలోని 865 జీపీల్లో సర్పంచులకు నెలకు రూ. 5,000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. ఆర్భాటంగా పదవులు చేపట్టిన ప్రజాప్రతినిధులకు క్షేత్రస్థాయిలో సమస్యలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని వారు కోరుతున్నారు.

కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన మహిళ పథకాల కోసం దరఖాస్తు చేసుకోగా, ఆన్‌లైన్ రశీదు ఉన్నా కార్యాలయంలో ఫైల్ కనిపించడం లేదు. దీనిపై బాధితురాలు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. రికార్డుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

నానో ఎరువుల ద్వారా సుస్థిర వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ వ్యవసాయ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన తిప్పర్తి (M) దుప్పలపల్లి రైతు వేదికలో సాంకేతిక ప్రదర్శన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.

Sorry, no posts matched your criteria.