India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈ నెల 6వ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేతుల మీదుగా నల్గొండ, తిప్పర్తిలో వీటిని అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మిల్లర్లతో చర్చలు సఫలం కాకపోవడంతో 6వ తేదీన కొనుగోళ్లు ప్రారంభం అవుతాయా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. కొనుగోళ్లలో జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు చేరడంతో ఉదయం 9 నుంచే తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని అంచనా. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఎండ ప్రభావం అధికంగా ఉంటుంది. కావున ప్రజలు డీహైడ్రేషన్ బారిన పడకుండా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు బాగా తాగాలి. ఎండలో బయటకు వస్తే టోపీ, సన్ గ్లాసెస్ తప్పనిసరిగా వాడాలి.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా జిల్లాలో 78 మీ-సేవ కేంద్రాలు శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మూతపడతాయి. మళ్లీ ఆదివారం ఉదయం 8 గంటలకు పెరిగిన చార్జీలతో ఇవి తెరుచుకుంటాయి. ప్రభుత్వం ఏ-కేటగిరీ సేవలను రూ.35 నుంచి 62కు, బీ-కేటగిరీని రూ.45 నుంచి 80కి పెంచింది. కొత్త ధరలు 5వ తేదీ నుంచి అమలవుతాయి. ఈ తాత్కాలిక మూసివేతపై ఆయా కేంద్రాల వద్ద బోర్డులు పెట్టాలని నిర్వాహకులను ప్రభుత్వం ఆదేశించింది.

నల్గొండ జిల్లాలో సిఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లపై ఇప్పటికీ కఠిన చర్యలు లేకపోవడం వివాదాస్పదంగా మారింది. 2022-23 సీజన్‌కు చెందిన రూ.191.13 కోట్ల విలువైన 5,89,533 క్వింటాళ్ల ధాన్యాన్ని 7 మిల్లులు దుర్వినియోగం చేసినట్లు తనిఖీల్లో తేలింది. కేసులు నమోదు చేసినప్పటికీ రాజకీయ నాయకుల చొరవతో చర్యలు నెమ్మదిస్తున్నాయి. కేసులో ఇప్పటికే ఒకరు అరెస్ట్ కాగా, మరికొందరు కోర్టును ఆశ్రయించారు.

జిల్లాలో అధికార కాంగ్రెస్ శ్రేణుల్లో నామినేటెడ్ పదవుల సందడి నెలకొన్నా, ఆశావహులకు మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు గడుస్తున్నా, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, కమిటీల భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసి.. ఇప్పుడు తమకు గుర్తింపు దక్కడం లేదని అంతర్గతంగా మదన పడుతున్నారు.

వానాకాలం సాగు వేళ నకిలీ పత్తి విత్తనాల విక్రయదారుల ఆట కట్టించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 5.13 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేయగా, ఇందుకోసం సుమారు17 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు గుర్తించారు. విడి విత్తనాల అక్రమ రవాణాను అరికట్టేందుకు త్రిముఖ వ్యూహంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వ్యాపారుల కదలికలపై నిరంతర నిఘా ఉంచనున్నారు.

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫీజు ఈనెల 20వ తేదీలోపు చెల్లించాలని NLG ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ CH.నర్సింహారావు తెలిపారు. టెన్త్ లేదా సమాన పరీక్ష ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి మే 13న పాలీసెట్-2026 నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. టెన్త్ హాల్టికెట్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉన్న వారు polycet.sbtet.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

MGU, టాస్క్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాలో 15 కంపెనీలు పాల్గొననున్నట్లు ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ హరీష్ కుమార్ తెలిపారు. ఐటీ, ఫార్మా, అగ్రికల్చర్, బ్యాంకింగ్ రంగాలలో సుమారు 1500 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాలిటెక్నిక్ డిప్లమో, ఇంజనీరింగ్ బీఎస్సీ అగ్రికల్చర్, B.Com,బీఫార్మ, MBA, MCA, M.Sc, డిగ్రీ చివరి సంవత్సరం అభ్యర్థులు హాజరు కావాలన్నారు.

నార్కట్‌పల్లిలో ఇవాళ గ్రామసభలో ఎస్పీ శరత్ చంద్ర పవర్ పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సాధ్యమన్నారు. ‘అలైవ్ అండ్ అరైవ్’ ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ వివరాలు పంచుకోవద్దన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సభలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏప్రిల్ నెల ‘సదరం’ శిబిరాల గడువును అధికారులు ప్రకటించారు. దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాల జారీ కోసం విభాగాల వారీగా తేదీలు కేటాయించారు. శారీరక వైకల్యానికి ఈ నెల 7, 16, 21, 23.. మానసిక స్థితికి 8, 22.. దృష్టి లోపానికి 9, 28.. శ్రవణ లోపానికి 6, 13, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అర్హులు మీ-సేవ లేదా UDID పోర్టల్‌లో ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.