Nalgonda

News April 1, 2026

ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు: కలెక్టర్ బి. చంద్రశేఖర్

image

‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న గ్రామ, మున్సిపల్ వార్డు సభలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సభల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News March 31, 2026

NLG: తగ్గిన టోల్ ధరలు.. రేపటి నుంచే అమలు!

image

HYD- VJY NH 65 మీదుగా ప్రయాణించే వాహనదారులకు ఏప్రిల్ 1 నుంచి టోల్ ధరలు తగ్గనున్నాయి. ఈ కొత్త రేట్లు మార్చి 31 అర్ధరాత్రి నుంచే అమలులోకి రానుండగా, పంతంగి టోల్ ప్లాజా వద్ద కారు/జీపులకు సింగిల్ జర్నీకి ₹80, రిటర్న్ జర్నీకి ₹115 గాను, కొర్లపహాడ్ వద్ద సింగిల్ జర్నీకి ₹120, రిటర్న్ జర్నీకి ₹180గా నిర్ణయించారు. అలాగే LCV, మినీ బస్సులు, భారీ 3 యాక్సిల్ వాహనాల ధరలు కూడా 2 ప్లాజాల వద్ద గణనీయంగా తగ్గాయి.

News March 31, 2026

రేషన్‌ దరఖాస్తుకు గడువే లేదు: మంత్రి ఉత్తమ్‌

image

అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులు అందజేస్తామని, దరఖాస్తుకు ఎలాంటి సమయ పరిమితి లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.రేషన్‌ కార్డుల కోసం ప్రజలు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదొక నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

నల్లగొండలో ‘ట్విన్నింగ్‌ ఆఫ్‌ స్కూల్స్‌’

image

సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు విద్యాశాఖ ‘ట్విన్నింగ్‌ ఆఫ్‌ స్కూల్స్‌’ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాల ప్రాథమిక చదువు పూర్తి చేసిన విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనే చేరేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ఇందులో భాగంగా విద్యార్థులను సమీప హైస్కూళ్లకు తీసుకెళ్లి అక్కడున్న అత్యాధునిక వసతులు, ల్యాబ్‌లు, డిజిటల్ తరగతులను ప్రత్యక్షంగా చూపించనున్నారు.

ఇకపై మధ్యాహ్న భోజనానికి ముందే ‘బ్రేక్ ఫాస్ట్’!

image

నల్గొండ జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం సరికొత్త శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కేవలం మధ్యాహ్న భోజనం, గుడ్లు మాత్రమే అందజేస్తుండగా, తాజాగా ‘తొలిముద్ద’ పేరిట ఉదయం వేళ పౌష్టిక అల్పాహారాన్ని అందించనున్నారు. జిల్లాలోని 2093 అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే 3 నుండి 6 ఏళ్ల వయస్సు గల 11,158 మందికి పైగా చిన్నారులకు ప్రయోజనం చేకూరనుంది.

News March 31, 2026

NLG: NH-65 విస్తరణపై నీలినీడలు..!

image

రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే అత్యంత కీలకమైన HYD-VJD ఆరు వరుసల విస్తరణ పనులు ఇంకా టెండర్ల దశలోనే ఆగిపోయాయి. ప్రయాణ సమయాన్ని తగ్గించి, ప్రమాదాలను అరికట్టేందుకు ఈ రహదారిని రూ. 10,391.53 కోట్లతో విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ఏడు నెలల క్రితమే డీపీఆర్ ఆమోదం పొందినా, నేటికీ టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.