Nalgonda

News March 31, 2026

NLG: NH-65 విస్తరణపై నీలినీడలు..!

image

రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే అత్యంత కీలకమైన HYD-VJD ఆరు వరుసల విస్తరణ పనులు ఇంకా టెండర్ల దశలోనే ఆగిపోయాయి. ప్రయాణ సమయాన్ని తగ్గించి, ప్రమాదాలను అరికట్టేందుకు ఈ రహదారిని రూ. 10,391.53 కోట్లతో విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ఏడు నెలల క్రితమే డీపీఆర్ ఆమోదం పొందినా, నేటికీ టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నల్గొండ: పన్ను కట్టలేదని 20 షాపులు సీజ్.. నేడే ఆఖరు

image

నల్గొండ నగరంలో ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదారులకు చెందిన 20 షాపులను సోమవారం మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సదరు యజమానులు పన్ను కట్టారు. కాగా, ఆస్తి పన్ను చెల్లింపునకు నేడే (మార్చి 31) ఆఖరు. గడువులోగా చెల్లించకుంటే అర్ధరాత్రి నుంచి ఆటోమెటిక్ గా అపరాధ రుసుము పడుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఆ వడ్డీని తగ్గించే అధికారం తమకు ఉండదని వారు హెచ్చరించారు.

News March 31, 2026

నల్గొండ: 3 నెలల రేషన్ బియ్యం.. రేపట్నుంచే

image

నల్గొండ జిల్లాలో రేపటి నుంచి లబ్ధిదారులకు 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో సభ్యుడికి ఆరు కిలోల చొప్పున మూడు నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని ఇవ్వనున్నారు. జిల్లాలో 5.27లక్షల కార్డులుండగా, ఇందుకోసం 22,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించారు. మొత్తం 1,051 రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ కోసం ఇప్పటికే బియ్యం స్టాక్ ఆయా షాపులకు తరలుతున్నాయి.

News March 31, 2026

నల్గొండ: ఏప్రిల్ 1 నుంచి ‘ఈ- ఆఫీస్’ తప్పనిసరి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏప్రిల్ 1 నుంచి దస్త్రాల నిర్వహణను పూర్తిగా ‘ఈ- ఆఫీస్’ విధానం ద్వారానే చేపట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. ఇప్పటికే అధికారులకు, సిబ్బందికి దీనిపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చామని ఆయన తెలిపారు. ఇకపై భౌతిక దస్త్రాలకు స్వస్తి పలికి, డిజిటల్ పద్ధతిలో పారదర్శకతతో పనులు వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

ఎస్సీ యువతకు స్వయం ఉపాధి రుణాలు

image

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం పొందేందుకు అర్హులైన యువత నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు కాపీని ధ్రువపత్రాలతో కలిపి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు.

News March 30, 2026

NLG: వైకల్యాన్ని అధిగమించి.. విజయం సాధించి

image

27వ జాతీయ సీనియర్ క్రీడల ఛాంపియన్‌షిప్‌ (చెవిటి)లో పతకాలు సాధించి జిల్లా కీర్తిని చాటిన క్రీడాకారులను కలెక్టర్ చంద్రశేఖర్ సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. వైకల్యాన్ని సైతం అధిగమించి, పట్టుదలతో క్రీడల్లో రాణించడం ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో ఈ క్రీడాకారులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు.

News March 30, 2026

NLG: ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

2025-26 రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు అవగాహన గోడపత్రికను కలెక్టర్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని, ధాన్యం రవాణాలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులు ఇబ్బందులు పడకుండా పక్కా ప్రణాళికతో కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు.