Nalgonda

News March 30, 2026

నాగార్జునసాగర్ వంతెన: రెండు రాష్ట్రాల వారధి

image

నాగార్జునసాగర్ వద్ద కృష్ణా నదిపై నిర్మించిన వంతెన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కీలక అనుసంధానకర్తగా నిలుస్తోంది. ఈ వంతెన ద్వారా రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సులభతరమై, వాణిజ్య, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రతిరోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగించడమే కాకుండా, సాగర్ ఆనకట్ట అందాలను వీక్షించే పర్యాటకులకు ఈ బ్రిడ్జి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

News March 29, 2026

నల్లగొండ: వేదిక మారింది.. రాతలు మారేనా..?

image

నల్లగొండ జిల్లాలో దివ్యాంగులు, వృద్ధుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం సరికొత్త శ్రీకారం చుట్టింది. ప్రతి నెల చివరి శనివారం వీరికి మాత్రమే కేటాయిస్తూ ప్రత్యేక ‘ప్రజావాణి’ని కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. సాధారణ రోజుల్లో రద్దీ వల్ల వీరు పడుతున్న ఇబ్బందులను గమనించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం అర్జీలు స్వీకరించడమే కాకుండా అక్కడికక్కడే పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు.

News March 29, 2026

నల్గొండ: 7,624 కేసులు పరిష్కారం: ఎస్పీ

image

న్యాయ వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక చక్కని వేదికని, దీని ద్వారా ప్రజలకు త్వరితగతిన న్యాయం అందుతుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పోలీస్, న్యాయ శాఖల సమన్వయంతో రికార్డు స్థాయిలో 7,624 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. పరిష్కారమైన కేసుల్లో 4,182 డీడీ కేసులు, 2,512 ఈ-పెట్టీ, 886 ఐపీసీ, 44 ఎస్ఎల్ఎల్ కేసులు ఉన్నాయని వివరించారు.

News March 29, 2026

సాగర్‌లో విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

image

నాగార్జునసాగర్‌లో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఏర్పాటుకు ఏపీ పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టే ఈ భారీ ప్రాజెక్టుకు జూన్‌లో శంకుస్థాపన చేయనున్నారు. సాగర్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్, తిరుపతి, బెంగళూరుతో పాటు విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది. దీంతో ఉభయ రాష్ట్రాల పర్యాటక రంగంలో కొత్త వెలుగులు నిండనున్నాయి.

News March 29, 2026

మరణంలోనూ ‘మహోన్నతం’.. ఆరుగురికి ప్రాణదానం

image

విధి ఆడిన వింత నాటకంలో ఒక నిండు ప్రాణం బలికాగా..పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. నల్గొండకు చెందిన బత్తిని హరీష్(25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే అతడి అవయవ దానానికి తల్లి మహేశ్వరి ముందుకు రావడం సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది. తమ బిడ్డ శాశ్వతంగా దూరమయ్యాడన్న చేదు నిజాన్ని దిగమింగుకుంటూనే.. మరో ఆరుగురి రూపంలో అతడిని చూసుకోవాలనుకుంది.

News March 29, 2026

NLG: బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ రూ.2500 !

image

జిల్లాలో గ్యాస్ కొరత అక్రమార్కులకు వరంగా మారింది. గతంలో 24 గంటల్లో వచ్చే సిలిండర్, ఇప్పుడు 15 రోజులు గడిచినా అందని పరిస్థితి నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు బ్లాక్ మార్కెట్‌లో డొమెస్టిక్ సిలిండర్‌ను రూ. 2500కు, కమర్షియల్ సిలిండర్‌ను ఏకంగా రూ.8000కు విక్రయిస్తూ సామాన్యులను నిలువునా దోచుకుంటున్నారు. గృహ అవసరాలకు రావాల్సిన కోటాను అక్రమంగా హోటళ్లకు మళ్లిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

News March 29, 2026

నల్గొండ: మొదలైన పునర్విభజన సెగ..!

image

2026 జనాభా లెక్కల ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల సంఖ్య పెరగనుండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. మునుగోడు విభజన, సూర్యాపేట కేంద్రంగా కొత్త పార్లమెంటు స్థానం ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రక్రియలో దక్షిణ భారత్‌కు అన్యాయం జరగకుండా చూడాలని, పారదర్శకమైన ఓటర్ల జాబితాతోనే డెలిమిటేషన్ చేపట్టాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

News March 29, 2026

నల్గొండలో గ్యాస్ కష్టాలు..15 రోజులైనా తప్పని నిరీక్షణ!

image

నల్గొండ జిల్లాలో వంటగ్యాస్ కొరత సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సిలిండర్ బుక్ చేసి 15 రోజులు గడిచినా సరఫరా కాకపోవడంతో వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారు. యుద్ధ ప్రభావంతో దిగుమతులు తగ్గడం ఒక కారణమైతే, గృహ అవసరాలకు వాడే సిలిండర్లను హోటళ్లకు మళ్లించి బ్లాక్ మార్కెట్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు.

News March 28, 2026

గణితం పరీక్షకు 71 మంది విద్యార్థులు గైర్హాజరు: DEO భిక్షపతి

image

ఇవాళ జరిగిన పదో తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈవో బిక్షపతి తెలిపారు. మొత్తం 71 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విభాగంలో 99.73 శాతం, ప్రైవేట్ విభాగంలో 29.17 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీగా నిర్వహణ చేపట్టామని, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 40 కేంద్రాలను, విద్యాశాఖాధికారులు 8 కేంద్రాలను తనిఖీ చేశారని ఆయన పేర్కొన్నారు.

News March 28, 2026

NLG: ముందస్తుగా పాఠ్య పుస్తకాలు.. ఈసారి బార్‌కోడ్!

image

జిల్లాలో పాఠశాలల ప్రారంభం నాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయాలనే లక్ష్యంతో విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. వచ్చే విద్యాసంవత్సరం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 5.60 లక్షల పుస్తకాలు అవసరం కాగా..ఇందులో ఇప్పటి వరకు 1.64 లక్షల పుస్తకాలు ఇప్పటికే చేరాయి. పుస్తకాల సరఫరాలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ప్రతీ పుస్తకానికి ప్రత్యేక కేటాయించి నమోదు చేస్తున్నారు.