India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. ఆదివారం ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ పై జిల్లా ఎస్పీ చందనా దీప్తితో కలిసి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 14 లక్షల 90 వేల 431 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు.
పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని, అలాగే పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు, వచ్చే జూన్ 6 వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదన్నారు.
నల్గొండ జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ పకడ్బందీగా అమలు చేస్తామని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యం అన్నారు. జిల్లా వ్యాప్తంగా 247 సమస్యాత్మక ప్రాంతాలు, 439 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని తెలిపారు.
అక్కడ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. అవసరమైన ప్రతీ చోటా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. పోలింగ్ కు సుమారు రెండు నెలల సమయం ఉండటంతో ప్రధాన పార్టీల్లో ప్రచారం, అభ్యర్థి చేసే ఖర్చుపై కొంత చర్చ సాగుతోంది. రెండు సెట్టింగ్ స్థానాలను నిలబెట్టుకునేలా అధికార పార్టీ ఓవైపు పావులు కదుపుతుండగా.. మరో వైపు బిఆర్ఎస్, బిజెపిలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదు కార్యక్రమం ఈనెల 14వ తేదీతో ముగిసింది. నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో 5,06,527 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో నల్గొండ – 87,596, సూర్యాపేట – 55,837, యాదాద్రి భువనగిరి – 39,066 మంది ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వచ్చేనెల 4న ఓటరు తుది జాబితా విడుదల చేయనున్నారు.
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల సంఘం పలు కీలక ఆదేశాలిచ్చింది. దీంతో జిల్లాలోని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు మోడల్ కోడ్ అమలుతో పలు చర్యలు చేపట్టారు. అంతరాష్ట్ర సరిహద్దులు తగిన చెక్‌పోస్టుల ఏర్పాటు చేశారు. ప్రజలు రూ.50 వేలకు మించి నగదు తరలిస్తే సరైన పత్రాలు వెంట ఉండాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వెల్లడించారు. లేనిపక్షంలో నగదును సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండపురిలో ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన పాలకుర్తి వెంకన్న రోజు మాదిరి కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కాడు. కల్లు గీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
BRS తరఫున నల్గొండ, భువనగిరి స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లోని సీనియర్ నేతలతో పలుమార్లు చర్చించినా.. అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోలేదు. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి వైపు అధిష్ఠానం దృష్టి సారించినట్లు సమాచారం. భువనగిరి నుంచి జిట్టా బాలక్రిష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు, బూడిద బిక్షమయ్యగౌడ్ పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీతో పూర్తి కానున్నాయి. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. జంబ్లింగ్ విధానంలో హాల్ టికెట్ నంబర్లను కూడా వేశారు. రోజూ ఉదయం 9.30 గం టల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. శనివారం జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ భిక్షపతి పరిశీలించారు.
గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజ్జిలాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వేమూరు మైపాల్ రెడ్డి అనే యువకుడు ఫిట్స్ వ్యాధితో బాధపడుతూ మనస్థాపానికి గురై శుక్రవారం గడ్డి మందు తాగడంతో గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. శనివారం సాయంత్రం యువకుడు మరణించాడు
Sorry, no posts matched your criteria.