India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏడేళ్ల తర్వాత కృష్ణా వెనుక జలాలు భారీగా వెనక్కి వెళ్లాయి. చేపలవేట చేసుకొని జీవనోపాధి పొందుతున్న మత్స్య కార్మికులకు ఈ ఏడాది కష్టంగా మారనుంది. నిత్యం చేపల కోసం మర బోట్లతో వేట కొనసాగించాల్సిన మత్స్యకార్మికుల కంటిచూపు మేర జలాలు వెనక్కి వెళ్లడంతో వారి మరబోట్లు ఒడ్డుకు చేరాయి. దీంతో చేపలవేట తగ్గుముఖం పట్టి ఇంటి వద్దే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మూగజీవాలకు పశుగ్రాసం కొరత వెంటాడుతోంది. ఉమ్మడి జిల్లాలో రైతులకు గడ్డు రోజులు ఎదురవుతున్నాయి. ఎండుగడ్డి కొరత తీవ్రంగా ఉండడంతో పశుపోషణ రోజురోజుకు భారంగా మారుతోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఎడమకాల్వ, మూసీ ప్రాజెక్టు, శాలిగౌరారం ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టులో గతేడాది నీరు సమృద్ధిగా ఉన్న కారణంగా యాసంగిలో లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఆయకట్టులో సాగు విస్తీర్ణం తగ్గింది.

భువనగిరి పట్టణ శివారులోని హుస్నాబాద్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు పట్టణ ఎస్సై సురేష్ తెలిపారు. కాలిపోయి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారని మృతుడి వయసు సుమారు 35 ఏళ్లు ఉంటాయన్నారు. కాలిపోయి ఉండటంతో ఎవరైనా హత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భువనగిరి పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఖరారైనట్లు తెలుస్తోంది. BNG, NLG స్థానాలను బీసీ, ఓసీలకు కేటాయించాలని బీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగా గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో గౌడ సామాజికవర్గం ఓట్లు ఉన్నందున BNG సీటును అదే సామాజికవర్గానికి చెందిన బిక్షమయ్య గౌడ్‌కు కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

నేటి నుండి ప్రారంభమవుతున్న పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సు ప్రయాణం సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజినల్ మేనేజర్ ఎస్. శ్రీదేవి తెలిపారు. వ్యాలిడిటీ కలిగిన బస్సు పాస్ ఉండి రూట్ తో సంబంధం లేకుండా హాల్ టికెట్ పై ఉన్న పరీక్ష కేంద్రానికి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, కాంబినేషన్ టికెటుతో ఎక్ ప్రెస్ బస్సులోనూ ప్రయాణం చేయవచ్చని తెలిపారు.

టెలివిజన్ ఛానళ్లు, వార్త పత్రికల్లో ప్రభుత్వ పథకాలపై ప్రకటన నిలిపివేయాలని నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోస్టర్లు, కరపత్రాలపై పబ్లిషర్, ప్రింటర్ పేరు, ఫోన్ నంబర్‌తో సహా ప్రచురించాలని, ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ప్రచురణకర్త ద్వారా డిక్లరేషన్ తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలో ఉల్లంగిస్తే ప్రజాప్రతినిధ్య చట్టం–1951 కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అత్త మృతిని తట్టుకోలేక కోడలు గుండెపోటుతో కుప్పకూలింది. యాదగిరిగుట్ట మండలం గొల్లగుడిసెకి చెందిన చుక్కల భారతమ్మ(65) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందింది. అత్త మృతదేహాన్ని చూసిన కోడలు మంగమ్మ(26) రోదిస్తూనే పడిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. వెంటనే భువనగిరి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒకేరోజు అత్తాకోడళ్ల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేటి నుంటి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. నల్గొండ జిల్లాలో మొత్తం 109 పరీక్ష కేంద్రాల్లో 19,715 మంది, సూర్యాపేటలోని 76 సెంటర్లలో 12,133 మంది, యాదాద్రిలో 51 సెంటర్లలో 9130 మంది పరీక్ష రాయనున్నారు. దీంతో సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుతోపాటు పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని డీఈఓ బిక్షపతి సూచించారు.

లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. ఆదివారం ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ పై జిల్లా ఎస్పీ చందనా దీప్తితో కలిసి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 14 లక్షల 90 వేల 431 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు.

పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని, అలాగే పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు, వచ్చే జూన్ 6 వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదన్నారు.
Sorry, no posts matched your criteria.