India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఓపెన్ టెన్త్, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు చిట్యాల ఎంఈవో సైదా నాయక్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఆలస్య రుసుముతో ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

జిల్లాలో టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి పెట్టేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. రక్షిత మంచినీరు సరఫరాపై ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ, పరిశుభ్రతపై పంచాయతీరాజ్ శాఖలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఏడో తరగతిలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. దరఖాస్తులను http://bsc.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లించి సమర్పించాలని కోరారు.

నల్గొండ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ పురుషులకు CCTV ఇన్స్టాలేషన్, సర్వీస్‌లో 13 రోజుల ఉచిత శిక్షణ సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభిస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి సోమవారం తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 సం. నుండి 45 లోపు ఉమ్మడి జిల్లా వారు అర్హులని,ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని 7032415062 సంప్రదించాలన్నారు.

నేడు (సోమవారం) నిర్వహించాల్సిన గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆయన అందుబాటులో ఉండని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని ఆయన కోరారు. వచ్చే సోమవారం గ్రీవెన్స్ డే యథావిధిగా జరుగుతుందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 8 నుంచి NLG పట్టణంలోని మైసయ్య విగ్రహం సమీపంలో అన్నపూర్ణ క్యాంటీన్ ఆవరణలో మెప్మా, పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. మెప్మా ద్వారా ఉపాధి పొందుతున్న మహిళల ఆధ్వర్యంలో వివిధ రకాల వంటల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

వీఆర్ఏలు, వీఆర్వోలు తిరిగి రెవెన్యూ శాఖలోకి వచ్చారు. ప్రభుత్వం వారిని గ్రామ పాలనాధికారులుగా కొత్తగా నియమించింది. శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కౌన్సిలింగ్ నిర్వహించి క్లస్టర్లను కేటాయించారు. జిల్లాలో 275 క్లస్టర్లు ఉంటే 276 మంది జీపీవోలుగా ఎంపిక చేసింది. సీసీఎల్ఏ నిబంధనల ప్రకారం జీపీఏలకు వారి ర్యాంకులను బట్టి కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

నల్గొండలోని ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాల్లో నిర్వహించిన ఆలిండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్ (19 విభాగాల్లో) 135 మంది వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొనగా 85 మంది రాష్ట్ర స్థాయి పోటీకి ఎంపికైనట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ఎండీ. అక్బర్అలీ తెలిపారు. ఎంపికైన వారు ఈ నెల 9 నుంచి 19 వరకు హైదరాబాద్ లో నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు.

త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి ప్రకటించారు. జిల్లాలోని అన్ని మండల పరిషత్, జిల్లా పరిషత్ కార్యాలయాల నోటీసు బోర్డులపై జాబితాలను ఉంచారు. జిల్లాలో 33 జడ్పీటీసీలు, 353 ఎంపీటీసీ స్థానాలకు గాను 1956 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 10, 73,506 మంది ఉన్నారు.

నల్గొండలోని ప్రభుత్వ ఐటీఐలో ఐటీఐ అభ్యర్థులకు ఈ నెల 9న అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ శ్రీరాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాకు ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, మెషినిస్టు, స్టెనోగ్రఫీ, డ్రస్కీ మేకింగ్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. ఆసక్తి, అర్హత గల వారు నేరుగా ఐటీఐ కాలేజీ వద్దకు హాజరు కావాలన్నారు.
Sorry, no posts matched your criteria.