India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు తిప్పర్తి యాదయ్యకి 22 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.35 వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.10.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2016లో చండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ కేసు విచారణ చేపట్టిన సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

జిల్లాలో గ్రామ పాలన అధికారుల నియామకాలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. జిల్లా నుంచి గ్రామ పాలనాధికారులుగా 276 మంది ఎంపికయ్యారు. వీరికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాదులోని హైటెక్ సిటీలో నియామక పత్రాలు అందజేయనున్నారు. జిల్లాలో ఏర్పాటుచేసిన 275 క్లస్టర్లలో వీరు నియామకం కానున్నారు. ఇవాళ కానీ రేపు గాని కలెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నారు.

నల్గొండ – దేవరకొండ రోడ్డులోని మాస్టర్ మైండ్ పాఠశాలకు చెందిన విద్యార్థిని జస్మిత స్కూల్ బస్సు కింద పడి చనిపోయిన సంగతి తెలిసిందే. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో బిక్షపతి పాఠశాలను సీజ్ చేశారు. .

ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. సోమవారం నుంచి 18005995991 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ బిల్లుల వివరాలు తెలుసుకునేందుకు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.

NLG జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 14తో PACSల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 42 PACSలు ఉన్నాయి. ప్రస్తుతం PACSల పనితీరు ఆధారంగా 15 సంఘాల పాలకవర్గాల పదవీ కాలాన్ని మాత్రమే పొడిగించారు. మరో 15 సంఘాల పదవీ కాలాన్ని వాటి పనితీరు ఆధారంగా ఉన్నత అధికారుల నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు డీసీఓ సిబ్బంది తెలిపారు.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 208 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ప్రతి సంవత్సరం మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శుక్రవారం నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నారు.

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద జిల్లాలో అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కుటుంబ పెద్ద మరణించినట్లయితే జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పీఆర్టీయూ తెలంగాణ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా చిలుముల బాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బొమ్మపాల గిరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నల్గొండలో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో సంఘం మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ కవిత, ఇమామ్ కరీం తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులకు గత ఏడు నెలలుగా జీతాలు అందకపోవడంతో కుటుంబాలు గడవని పరిస్థితి నెలకొంది. ఒక్కోబడిలో కంప్యూటర్ ఆపరేటర్, ఫిజికల్ డైరెక్టర్, అటెండర్, వాచ్మెన్ తదితరులను ఈ విధానంలో నియమించారు. వీరికి వేతనం అరకొరగానే అందిస్తున్నారని తెలిపారు. అయినా నెల నెల వేతనాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సెప్టెంబర్ నెలకు సంబందించి సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో షాపులు తెరిచి బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే 75 శాతం బియ్యం గోదాముల నుంచి రేషన్ షాపులకు చేరింది. ఈ నెల నుంచి కొత్త గా 44,099 కార్డులకు బియ్యం అందనుంది. కాగా నల్గొండలో కొందరు రేషన్ డీలర్లు రెండో తేదీన, మరికొందరు మూడో తేదీ నుంచి పూర్తిస్థాయిలో షాపులు తెరిచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.