India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్, వరంగల్ -ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి రాష్ట్ర ప్రధానఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి తెలియజేశారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మనవరాలి పెళ్లికి పందిరి వేసేందుకు చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా చెట్టు పైనుంచి జారిపడి వృద్ధుడు మృతి చెందిన ఘటన చింతపల్లి మం.లో జరిగింది. ధైర్యపురితండాకు చెందిన బాలయ్య(65) మనవరాలి వివాహం శుక్రవారం జరగనుండగా.. పందిరి వేసేందుకు గురువారం తమ పొలానికి సమీపంలో చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా జారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి.
కరెంట్ షాక్‌తో మేకల కాపరి మృతి చెందిన ఘటన తిప్పర్తి మండలంలోని మర్రిగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాషా(48) మేకల కాపరిగా జీవనం కొనసాగిస్తున్నాడు. వాటి మేత కోసం తుమ్మచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి చెట్టు మీదనే మృతి చెందాడు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని RTC ప్రత్యేక బస్సులను నడిపించనుంది. ఈ నెల 25 నుంచి 27 వరకు ఉమ్మడి జిల్లాలోని 7 డిపోల పరిధిలో 70 బస్సులను నడిపించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి దూర ప్రాంతాలకు కాకుండా మూడు జిల్లాలోనే వివిధ దేవాలయాలకు బస్సులు నడిపించేలా ప్రణాళికలు రూపొందించారు. DVK డిపో నుంచి మాత్రం శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడిపిస్తారు.
ఓ యువతి ప్రియుడి ఇంటి ధర్నా చేసిన ఘటన మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో జరిగింది. బాధితురాలి వివరాలు.. లక్ష్మాపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మల్లెపాక నాగరాజు వెంపటి గ్రామానికి చెందిన యువతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని గురువారం అతడి ఇంటి ముందు బైఠాయించింది. వేరే అమ్మాయిని వివాహం చేసుకుని తనకు ఫొటోలు పంపాడని తనకు న్యాయం చేయాలని కోరింది.
దురాజ్ పల్లి లింగమంతులస్వామి జాతర సందర్భంగా ఈ నెల 16వ తేదీ నుంచి HYD- VJD హైవేపై ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు ఎత్తివేశారు.గురువారం జాతర ముగియడంతో NKP, KDD, టేకుమట్ల, బీబీగూడెం, రాఘవపురం గ్రామ స్టేజీ వద్ద ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తివేసి బారికేడ్లు తొలగించారు. దీంతో HYD- VJD, VJD- HYDకు వెళ్లే వాహనదారులు యథాతథంగా వెళ్లవచ్చని సూచించారు.
వేసవిలో విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ పంపిణి సంస్థ సీఎండి ముషారఫ్ ఫరూకీ ఆదేశించారు. గురువారం ఆయన NLG కలెక్టర్ కలెక్టరేట్లో విద్యుత్ సరఫరాకు సంబంధించి “వేసవి కార్యాచరణ ప్రణాళిక” పై సమీక్ష నిర్వహించారు. గతేడాది FEB 20 నాటికి జిల్లాలో 66 సబ్ స్టేషన్లపై ఓవర్ లోడ్ ఉండేదని.. ఈసారి ఒక సబ్ స్టేషన్లో కూడా ఓవర్ లోడ్ లేదని తెలిపారు.
గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం జిల్లాలో తాగునీటికి సమస్యలు రాకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎంపీడీవోలు, తహశీల్దారులను ఆదేశించారు. గురువారం ఆమె ఉదయాదిత్య భవన్లో తహశీల్దారులు, ఎంపీడీవోలతో వేసవి కార్యాచరణ ప్రణాళిక పై సమీక్ష నిర్వహించారు. ఎక్కడైనా తాగునీటి పైపులు, నల్లాలు తదితర అత్యవసర మరమ్మతులు ఉన్నట్లయితే గ్రామపంచాయతీ నిధుల నుంచి చేయించాలని ఆదేశించారు.
సూర్యాపేట జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు యువకులు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు బైక్‌పై వెళ్లి వస్తుండగా సూర్యాపేట రూరల్ పరిధి కేసారం గ్రామం సమీపంలోని వాగులో పడ్డారు. ఈ ప్రమాదంలో కాసరాబాద్ గ్రామానికి చెందిన సుధీర్(21) మృతి చెందగా, సంపత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండలో నిర్వహిస్తున్న 46వ మహాసభలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని రాష్ట్ర కార్యదర్శిగా నాగరాజు ప్రకటించారు. అధ్యక్ష, కార్యదర్శులుగా నరేష్, శంకర్లు, ఉపాధ్యక్షుడుగా కుర్ర సైదానాయక్ మిగతా కమిటీ సభ్యులుగా జగన్ నాయక్, వీరన్న, న్యూమన్, ప్రసన్న, పుట్ట సంపత్‌లు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.