India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం 72,642 మంది రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 732 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వివిధ కారణాలతో 93 దరఖాస్తులను మూసేశారు. 37,814 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 14,702 మంది స్థలాలకు అనుమతి లభించగా.. ఇప్పటివరకు 662 మంది మాత్రమే ఫీజు చెల్లించారు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. దశాబ్దాల కాలం నుంచి నూతన రైల్వే లైన్ల కోసం నల్గొండ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. శంషాబాద్ -SRPT – VJD హై స్పీడ్ రైల్వే లైన్, డోర్నకల్-SRPT-NLG-గద్వాల్ రైల్వే లైన్ కోసం గత ఏడాది సర్వే చేశారు. డోర్నకల్-MLG రైల్వే లైన్, హైదరాబాద్-యాదాద్రి ఎంఎంటీఎస్ రైలుపై బడ్జెట్లో ప్రకటన ఉంటుందో లేదో మరి చూడాలి.?
WGL- KMM- NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ఈనెల 3న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడంతో పాటు, ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు ఇచ్చేందుకు రావద్దని సూచించారు.
త్రిపురారం మండలంలోని మాటూరుకి చెందిన ధనావత్ వస్త్రాంనాయక్ భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. దీంతో అతనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మాటూరు మాజీ సర్పంచ్ వాంకుడోత్ లలిత పాండు నాయక్ అతణ్ని ఘనంగా సన్మానించారు. స్నేహితులు, బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జవహర్ నవోదయలో 9, 11 తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫిబ్రవరి 8న నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరుకావాలని జవహర్ నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. www.navodaya.gov.in వెబ్ సైట్ ద్వారా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
చెర్వుగట్టు శ్రీ పార్వతి జిల్లా రామలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి చెర్వుగట్టులో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయానికి రంగులు వేసే కార్యక్రమం పూర్తి కావచ్చిందని టెంపుల్ కార్యనిర్వాహణాధికారి నవీన్ కుమార్ అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
మునుగోడు మండల పరిషత్ ప్రాదేశిక (ఎంపీటీసీ) స్థానాల పునర్విభజనను అధికారులు పూర్తి చేశారు. నూతనంగా ఏర్పాటైన గట్టుప్పల్ మండలంలో వెల్మకన్నె ఎంపీటీసీ స్థానం కలవడంతో దానిని తొలగించారు. ప్రస్తుతం ఉన్న 31 గ్రామ పంచాయతీలను 13 ఎంపీటీసీ స్థానాలుగా గుర్తించారు. ఒక్కో ఎంపీటీసీ స్థానంలో 2వేల ఓటర్లు ఉండేలా సిద్ధం చేశారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఎంపీడీవో శాంతకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.
మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెంను ఫిబ్రవరి 10 వరకు ఖాళీ చేయాలని ఇరిగేషన్ డీఈ కాశీం గ్రామస్థులకు సూచించారు. గురువారం సమావేశం నిర్వహించి వారికి వివరించారు. తమకు పూర్తి నష్ట పరిహారం, R&R ప్యాకేజీ, ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు గ్రామాన్ని ఖాళీ చేసే ప్రసక్తే లేదని గ్రామస్థులు స్పష్టం చేశారు.
చిన్నపిల్లలు, మహిళల సంరక్షణ బాధ్యత పూర్తిగా మహిళ, శిశు సంక్షేమ శాఖతో పాటు జిల్లా యంత్రాంగంపై ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె జిల్లా కలెక్టరేట్లో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, మహిళా శిశు సంరక్షణ, పాత అంగన్వాడి కేంద్రాల మరమ్మతులు, తదితర అంశాలపై ఐసీడీఎస్ అధికారులతో సమీక్షించారు.
మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్ బాబు ఆధ్వర్యంలో యుటీఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా టికెట్ తీసుకునే విధానంపై రైల్వే ప్రయాణికులకు అవగాహన కల్పించారు. క్యూ లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేకుండా మొబైల్ అప్లికేషన్ ద్వారా త్వరగతిన టికెట్ తీసుకుని రైలు ప్రయాణం చేయవచ్చని ప్రయాణికులకు సూచించారు. ఈ అవకాశాన్ని ప్యాసింజర్స్ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.