Nalgonda

News February 9, 2026

NLG: ఫిబ్రవరి 10, 11న విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు

image

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఫిబ్రవరి 10, 11 తేదీల్లో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ స్థానిక సెలవు ప్రకటించారు. ఎన్నికల విధులకు వినియోగించే అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇతర బహిరంగ భవనాలకు ఈ సెలవు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది.

News February 8, 2026

నల్లగొండ: మున్సిపల్ ఎన్నికలు.. 11న స్థానిక సెలవు!

image

నల్లగొండ జిల్లాలో ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా కలెక్టర్ చంద్రశేఖర్ స్థానిక సెలవు ప్రకటించారు. నల్లగొండ కార్పొరేషన్ సహా జిల్లాలోని మిర్యాలగూడ, హాలియా, చండూరు, చిట్యాల పురపాలక సంఘాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సెలవు వర్తిస్తుంది. ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

News February 8, 2026

NLG: ఓట్ల లెక్కింపునకు వేదిక ఖరారు.. 3 రోజులు సెలవు!

image

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం నిడమనూరులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను కౌంటింగ్ కేంద్రంగా అధికారులు ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఈ పాఠశాలకు ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు స్థానిక సెలవులను ప్రకటించారు. లెక్కింపు ప్రక్రియకు ఆటంకం కలగకుండా ప్రిన్సిపాల్ తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

News February 8, 2026

NLG: గల్లంతైన వ్యక్తి కోసం NDRF గాలింపు!

image

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో కారు పడి గల్లంతైన పుల్లయ్య కోసం NDRF బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. నిన్న జరిగిన ప్రమాదంలో భార్య పద్మ మృతదేహం లభించగా, భర్త జాడ తెలియక పలు అనుమానాలకు దారితీస్తోంది. ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ ఘటనను ప్రమాదమా లేక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో అతడిని విచారిస్తున్నారు.

News February 8, 2026

NLG: 22 మంది ఎంఈఓలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు

image

ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన 22 మంది మండల విద్యాధికారులపై (MEOs) నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 30 నాటికి పూర్తి కావాల్సిన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనందుకు వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల ఉపకార వేతనాల విషయంలో అలసత్వం వహించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దీనిపై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

News February 8, 2026

ముకుందాపురంలో సాగర్ ఎడమ కాలువలో గల్లంతైంది వీరే

image

ముకుందాపురంలో ఓ కారు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన ఈ ఘటనలో కారులోని ప్రయాణిస్తున్న దంపతులిద్దరూ గల్లంతవ్వగా, డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడు. నీటిలో మునిగిపోయిన భార్యభర్తలు త్రిపురారం(M) కంపాసాగర్‌ చెందిన పుల్లయ్య, పద్మగా సమాచారం. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News February 7, 2026

ప్రలోభాలపై ఉక్కుపాదం: ఎస్పీ శరత్ చంద్ర పవార్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శనివారం ఆయన పలు చెక్‌పోస్టులను సందర్శించి భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అక్రమంగా నగదు, మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

News February 7, 2026

డిండి ఐటీఐలో సోమవారం అప్రెంటిస్ మేళా

image

డిండి ప్రభుత్వ ఐటీఐలో సోమవారం ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా (PMNAM) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వీరవల్లి రాధాకృష్ణ తెలిపారు. నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పలు ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళాకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 9705182677 నంబర్‌ను సంప్రదించవచ్చు.