India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ మంత్రులపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రశంసలు కురిపించారు. నల్గొండ జిల్లా మంత్రులు బోళాశంకరులని ఏది అడిగినా ఆలోచించకుండానే సరే అంటారని చెప్పారు. కానీ ఖమ్మం జిల్లా మంత్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఓకే చేస్తారని గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వ్యాఖ్యానించారు. కాగా జిల్లా మంత్రులపై కూనంనేని వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. కూనంనేని వ్యాఖ్యలపై మీ కామెంట్స్.
మంత్రి పదవిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులపై ఆశ లేదని రావాల్సిన టైంలో మంత్రి పదవి వస్తుందన్నారు. ఇప్పటివరకు ఏ పదవులు అడగలేదని.. పార్టీ కోసం కష్టపడే వారికి అధిష్ఠానం పదవులు ఇస్తుందన్నారు. ఏ డ్రెస్సులు వేసుకున్నా ఆఖరికి బీఆర్ఎస్ నేతలకు జైలు డ్రెస్సే గతి అంటూ ఎద్దేవా చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శాలువాతో సన్మానించారు. పిలాయిపల్లి, దర్మారెడ్డి కాల్వల ఆధునీకరణకు నిధులు కేటాయించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, మందుల సామేల్ తదితరులున్నారు.
యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ ఉ.9గం.లకు మహా చండీహోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చన్నారు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వేను సమస్యలు వెంటాడుతున్నాయి. సర్వర్ సతాయింపుతో పాటు.. గ్రామాల్లో నెట్ సక్రమంగా అందకపోవడంతో సర్వేకు సమస్యగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో 4,31,831 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు 67 వేల ఇండ్లను మాత్రమే సర్వే చేసినట్లు తెలుస్తోంది. రోజుకు 50 ఇళ్లను సర్వే చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినా.. సర్వేను సమస్యలు వెక్కిరిస్తున్నాయి.
మహిళ మృతికి కారణమైన నిందితుడికి మిర్యాలగూడ ఐదో అదనపు న్యాయమూర్తి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. మిర్యాలగూడ మండలం జైత్రాంతండాకు చెందిన సైదులు లక్ష్మమ్మను ట్రాక్టర్‌తో గుద్ది చంపేశాడు. అప్పటి మిర్యాలగూడ ఎస్‌ఐ కేసు నమోదు చేయగా.. సీఐ రమేశ్ మాబు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది.
చింతపల్లి మండల కేంద్రంలోని డా. ఆలూకా జైహింద్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను డిఐఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలో ఉత్తమ ఫలితాలకై అధ్యాపకులు అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించాలన్నారు. ప్రైవేటు కళాశాలల కంటే ప్రభుత్వ కళాశాలలో మెరుగైన ఫలితాలు రావాలన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. ఆయన వెంట అధ్యాపకులు ఉన్నారు.
ఈ నెల 30న టైలరింగ్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ ఎ.అనిత తెలిపారు. పదో తరగతి పాస్, ఫెయిల్ అయిన మహిళలు అప్లై చేసుకోవాలన్నారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉండి యోగ్యతా పత్రం కలిగిన వారు అర్హులన్నారు. టైలరింగ్లో 30 సీట్లు ఉన్నాయని, శిక్షణ 45 రోజులు ఉంటుందని చెప్పారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందింది సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి లింగమంతుల స్వామి జాతర. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. 2025 ఫిబ్రవరి 2న దిష్టి పూజ నిర్వహించి, 16 నుంచి 20వ తేదీ వరకు జాతర నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల నుంచి భక్తులు తరలివస్తారు.
తెల్లరేషన్ కార్డు ఉండి మహాలక్ష్మి పథకం కింద రూ.500 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పథకానికి గతంలో అప్లై చేయని వారు మళ్లీ అప్లై చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని లబ్ధిదారులకు సూచించారు. దరఖాస్తుతో పాటు, ఎల్పీజీ వినియోగదారు నంబరు, ఆధార్ కార్డు వివరాలు, జిరాక్స్, ఎల్పీజీ గుర్తింపు ధ్రువపత్రాలతో అప్లై చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.