India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామ స్టేజి వద్ద విజయవాడ-హైదరాబాద్ వెళ్తున్న భారీ కంటైనర్‌ని దాటిన కారు ఓ లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై అడ్డంగా ఉన్న కంటైనర్‌ను క్రేన్ సాయంతో పక్కకు తీసేశారు.
ఆన్లైన్ బెట్టింగ్ మరొకరి ప్రాణం తీసింది. పోచారం PS పరిధి శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ స్టూడెంట్ నితిన్(21) మంగళవారం రైల్ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన నితిన్ కాలేజీ ఫీజు కోసం రూ.1.3 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులు బెట్టింగ్‌లో పోగొట్టాడు. తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
‘ఆర్టీసీ బస్సులో ఓటర్ ఐడీ చెల్లదు. టికెట్ తీసుకో లేదంటే బస్సు దిగి పో’ అంటూ తన పట్ల కండక్టర్ దురుసుగా ప్రవర్తించినట్లు నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వగ్రామానికి వెళ్లేందుకు మంగళవారం కోదాడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ఎక్కానని , సదరు కండక్టర్ ఓటర్ ఐడీ చెల్లదంటూ మధ్యలోనే దించేశారని బాధితురాలు వాపోయారు.
ఇస్కాన్ టెంపుల్ కూకట్పల్లి వారి ఆధ్వర్యంలో చేపట్టిన పూరి జగన్నాథ రథయాత్ర బుధవారం దేవరకొండ పట్టణానికి చేరుకోనుంది. ఇప్పటికే యాత్రకు సంబంధించిన కమిటీ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పట్టణానికి చేరుకోనున్న రథయాత్ర స్థానిక అయ్యప్పస్వామి దేవాలయం నుంచి ప్రారంభమై కొండల్రావు బంగ్లా వరకు కొనసాగనుంది. అనంతరం రాత్రి 7గంటలకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పురుగు మందు తాగిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాలు మేరకు.. సూర్యాపేటకు చెందిన బాలిక(15) మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఈనెల 6న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు సీఐ తెలిపారు.
అనంతగిరి మండలం వెంకట్రాంపురంలో గడ్డి వాము పంచాయతీ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పల్లె సుధాకర్, తుళ్లూరు అచ్చయ్య గడ్డివాము విషయంలో గొడవపడ్డారు. అచ్చయ్య సుధాకర్‌ను నెట్టి వేయగా సుధాకర్ తలకు తీవ్ర గాయమైంది. హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనంతగిరి ఎస్ఐ తెలిపారు.
తపాలా శాఖలో కమిషన్ ప్రాతిపదికన పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 18న సూర్యాపేట పోస్ట్ ఆఫీస్‌లో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సూర్యాపేట డివిజన్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ జి.సైదులు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సూర్యాపేట డివిజన్లోని 347 పోస్ట్ ఆఫీసులు పరిధిలో 18 ఏళ్లు నిండి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తూ పోలీస్ శాఖ వారికి రక్షణ కల్పిస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్, షీటీమ్ పోలీస్ స్టేషన్, భరోసా సెంటర్లను ఎస్పీ మంగళవారం పరిశీలించారు. ఆకతాయిలు మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ సందర్భంగా ఎస్సీ హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా పటేల్ రమేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు.
VRAలను విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన వ్యక్తంచేశారు. GO 81 ప్రకారం 60 ఏళ్లలోపు వారిని 61ఏళ్లు నిండిన ఉద్యోగుల వారసులను విధులలోకి తీసుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. VRAలను గత ప్రభుత్వం 81వ GO ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 20,555 VRAలు ఉంటే 16,758 మందిని విధుల్లోకి తీసుకుంది. మిగతా 3,797మందిని ఎలక్షన్ల తర్వాత తీసుకుంటామని ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు.
Sorry, no posts matched your criteria.