Nalgonda

News June 8, 2024

సోనియా గాంధీని కలిసిన నల్గొండ, భువనగరి ఎంపీలు

image

ఎంపీగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఢిల్లీలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డితో సోనియా గాంధీని కలిశారు. ఈ కార్యక్రమంలో మిగతా ఎంపీలు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.

News June 8, 2024

యాదాద్రి ఆలయంలో వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు

image

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు వృద్ధులు, వికలాంగులు
అనారోగ్యంతో నడవలేని స్థితిలో బ్యాటరీ వెహికిల్ తో పాటుగా దేవస్థానం ప్రోటోకాల్ కార్యాలయం ముందు వీల్ చైర్లు అందుబాటులో ఉన్నాయని ఆలయా ఈవో భాస్కర్ రావు
తెలిపారు. ఈ బ్యాటరీ వెహికల్ అవసరమైన భక్తులు తమ పేరును, సెల్ నెంబర్ నమోదు చేసుకొని ప్రోటోకాల్ కార్యాలయంలో గల ఈ వీల్ చైర్ లను భక్తులు ఉపయోగించు కోవాలన్నారు.

News June 8, 2024

ఎంజీయూలో 5 ఏళ్ల ఫార్మా కోర్సు

image

ఇంటర్ విద్యతో MGUలో 5సం.రాల ఇంటిగ్రేటెడ్ ఫార్మాసుటికల్ కెమిస్ట్రీ పీజీ కోర్స్ చేయవచ్చని అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంజీయూ ప్లేస్మెంట్ డైరెక్టర్ డాక్టర్ వై.ప్రశాంతి తెలిపారు. కోర్సు పూర్తి అయిన విద్యార్థులకు నేరుగా ఫార్మా ఇండస్ట్రీలో అవకాశాలు, ప్రాజెక్టు వర్క్ కోసం ఇండస్ట్రీ, ఐఐసీటీ, ఐఐటీని ఎంచుకోవచ్చన్నారు. ఈ కోర్సును OU నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అర్హత సాధించి ఎంచుకోవచ్చన్నారు.

News June 8, 2024

గ్రూప్-1 ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

రేపు గ్రూప్-1 పరీక్ష జరుగుతున్న దృష్ట్యా యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే భువనగిరిలోని జాగృతి, మదర్ థెరిసా కాలేజీలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. నిరుద్యోగులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

News June 8, 2024

ఆటా మహాసభల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

image

అమెరికాలోని అట్లాంటా నగరంలో జరుగుతున్న 18వ ఆటా మహాసభలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. వారి వెంట తెలంగాణ ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రవాస భారతీయులు తదితరులున్నారు.

News June 8, 2024

కోకా కోల డైరెక్టర్‌తో మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు భేటీ

image

అమెరికా పర్యటనలో ఉన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు శనివారం అట్లాంటాలోని కోకా కోలా హెడ్ క్వార్టర్స్‌లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్ డైరెక్టర్ జోనాథన్ రీఫ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోకా-కోలా మేనేజ్ మెంట్‌ను ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులను విజువల్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు.

News June 8, 2024

నల్గొండ: కాంగ్రెస్ ఫస్ట్ టైం విన్

image

NLG-WGL-KMM పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే గెలుపుతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ ఈ స్థానాన్ని ఫస్ట్ టైం గెలుచుకున్నట్లైంది. 2015, 21లో ఈస్థానాన్ని బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) గెలుచుకుంది. ఈ సారి మాత్రం పట్టభద్రులు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు.

News June 8, 2024

తీన్మార్ మల్లన్న విజయం.. రేవంత్ రెడ్డి విషెస్

image

పట్టభద్రుల MLCగా గెలుపొందిన తీన్మార్ మల్లన్నకు ట్విటర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విషెస్ చెప్పారు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు తెలిపారు. తీన్మార్ మల్లన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలపై ప్రశ్నించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఇదే స్థానంలో గెలిచిన పల్లారాజేశ్వర్ రెడ్డికి టఫ్ ఫైట్ ఇచ్చారు.

News June 8, 2024

‘2009 నుంచి బీజేపీ గెలవలేదు’

image

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంపై కాషాయజెండా ఎగరవేయాలని నాయకులు 2009 నుంచి ప్రయత్నిస్తున్నారు. 2009లో బీజేపీ నుంచి పోటీచేసిన చింతా సాంబమూర్తి నామమాత్రపు పోటీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో TDPతో కలిసి పోటీ చేసిన పార్టీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డి శ్రమించినా ఫలితం దక్కలేదు. 2019లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పీవీ శ్యామ్‌సుందర్‌రావు ఓటమిపాలయ్యారు, ప్రస్తుతం నర్సయ్య ఓటమితో బీజేపీకి నిరాశే మిగిల్చింది.

News June 8, 2024

మూడు రోజుల పాటు నానా అవస్థలు

image

పట్టభద్రుల MLC ఉపఎన్నిక లెక్కింపు 60 గంటలకు పైగా సాగింది. కౌంటింగ్‌లో మొత్తం 52మంది అభ్యర్థులు, 3వేల మందికి పైగా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 12 గంటల పాటూ ఏకధాటిగా విధుల్లో ఉండడంతో అలసిపోయారు. గోదాముల్లో కూలర్లు ఏర్పాటు చేసినా అక్కడి ఉక్కపోతతో కొంతమంది డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. గతంలో 56 టేబుళ్లపై లెక్కించగా.. ఈ దఫా 96టేబుళ్లపై ఓట్లను లెక్కించిన ప్రక్రియ ఆలస్యమవడంతో అవస్థలు పడినట్లు తెలిపారు.