India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ థియరీ పరీక్షలు ఆగస్టు 4న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. ఆగస్టు 4న ఆదివారం ఎడ్యుకేషనల్ సైకాలజీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ జనరల్ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ స్పెషల్ పరీక్ష 3.30 నుంచి 4:30 వరకు జరుగుతాయని తెలిపారు.
ఉమ్మడి నల్గొండలో విస్తరించి ఉన్న నల్లమలలో రెండేళ్లలో జంతువులు గణనీయంగా వృద్ధి చెందినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. నాగార్జున సాగర్ అటవీ డివిజన్ పరిధిలో పెద్దపులి సంచారాన్ని నిర్ధారించడంతో పాటు అరుదైన జాతికి చెందిన రాబందు సైతం ఇక్కడ కనిపించడంతో వాటి సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా నల్గొండ పరిధిలో ఉన్న డివిజన్‌లో నాగార్జున సాగర్, కంబాళపల్లి, దేవరకొండ రేంజ్‌లున్నాయి.
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో రానున్న 3 రోజులపాటు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, జీపీ ప్రత్యేక అధికారులతో గ్రామాలలో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. GP ఆవరణతో పాటు, ఇతర ప్రభుత్వ సంస్థలు, రహదారులకు ఇరువైపులా పిచ్చి మొక్కలు లేకుండా తొలగించాలన్నారు.
గరిడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి శనివారం ఓ దొంగ పరారైయ్యాడు. వ్యవసాయ మోటార్ల చోరీ కేసులో అదుపులోకి తీసుకోని విచారిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి చాకచక్యంగా పరారైనట్టు తెలుస్తోంది. కేసులో పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో ఉంచారు. పరారీ అయిన అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఎస్పీ సీరియస్ అయినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
సింగపూర్‌లో తెలుగు యువకుడు మృతి చెందాడు. వివరాలిలా. కోదాడకి చెందిన చౌడవరపు పవన్ సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. పవన్ మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
డిండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జులై 2న 16 మంది విద్యార్థినులు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని, పాఠశాలలో ఎలుకలు కరవడంపై ప్రిన్సిపల్ సంబంధం లేని సమాధానం చెబుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
డిండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జులై 2న 16 మంది విద్యార్థినులు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని, పాఠశాలలో ఎలుకలు కరవడంపై ప్రిన్సిపల్ సంబంధం లేని సమాధానం చెబుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎర్ర పహాడ్ స్టేజి సమీపంలో 365వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. పెదనేమిలకి చెందిన తన్నీరు సత్తయ్య మృతి చెందాడు. బైక్‌పై సూర్యాపేట నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో నిద్రమత్తులో డివైడర్‌ని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సత్తయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ సుమారు గంటపాటు నిలిచిపోయింది. చక్రంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రైలును నిలిపేశారు. సిబ్బంది సమస్యను గుర్తించి మరమ్మతులు చేపట్టారు.
విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి చెందిన ఘటన మాడుగులపల్లి మండలం పాములపహాడ్ గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుర్రి రేణుక (38) శుక్రవారం ఇంటి ఆవరణలో శుభ్రం చేస్తోంది. తెగిపడిన కరెంట్ వైర్ తగిలి షాక్‌కు గురైంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.