Nalgonda

News June 1, 2024

AARA SURVEY: నల్గొండ, భువనగిరి కాంగ్రెస్‌దే..!

image

నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్‌దే అని ఆరా మస్తాన్ సర్వే తేల్చి చెప్పింది. నల్గొండలో BRS నుంచి కంచర్ల కృష్ణరెడ్డి, కాంగ్రెస్ కందూరు రఘువీర్ రెడ్డి, BJP నుంచి సైదిరెడ్డి రెడ్డి పోటీ చేశారు. ఇక భవనగిరిలో BRS నుంచి క్యామ మల్లేశ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్, BJP నుంచి బూర నర్సయ్య పోటీలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారని సర్వే అంచనా వేసింది.

News June 1, 2024

BREAKING: నకిరేకల్ యువతి ఆత్మహత్య

image

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన సంగీత(24) తన సోదరుడితో కలిసి HYD వచ్చింది. మేడ్చల్‌లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉంటూ గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని చనిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు.

News June 1, 2024

NLG: చెరువుల్లో నీరే లేదు.. చేప పిల్లలు పోశారట!

image

గతేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా నల్గొండ జిల్లాలో రిజర్వాయర్లు చెరువులు, కుంటల్లో నీరు చేరలేదు. చెరువులు కుంటల్లో నీరు లేకున్నా చేప పిల్లలు వదిలినట్లు కాంట్రాక్టర్లు మాయాజాలం ప్రదర్శించడంపై పలువురు మండిపడుతున్నారు. ఇదే విషయమై రూ.6 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి సిఫార్సులు పంపారట. దీనిపై మత్స్య సహకార సంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

News June 1, 2024

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో డ్రెస్ కోడ్ అమలు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నట్లు ఈవో భాస్కర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పక సంప్రదాయ దుస్తులు ధరించాలని తెలిపారు. మహిళలు చీర, చుడీదార్, పురుషులు దోతి, తెల్ల లుంగీ, షర్ట్ ధరించవచ్చని సూచించారు.

News June 1, 2024

నల్గొండ: రక్తంతో ఎమ్మెల్యే చిత్రపటం

image

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై అభిమానాన్ని ఓ యువకుడు వినూత్నంగా చాటుకున్నాడు. ఆయన పుట్టినరోజు సంబర్భంగా తన రక్తపు చుక్కలతో వీరేశం చిత్రపటాన్ని వేయించి అభిమానం తెలియజేశాడు నార్కెట్‌పల్లి మండలం ఏపి లింగోటం గ్రామానికి చెందిన కొరివి శివరాం. ప్రాణమున్నంత వరకు ఆయన వెంట నడుస్తానని శివరాం చెబుతున్నాడు.

News June 1, 2024

నల్గొండ: పంచాయతీ ఎన్నికలకు ఆశావహుల ఎదురుచూపు

image

గ్రామస్థాయి నేతలు పంచాయతీ ఎన్నికల సమరం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ జూన్లో ఎన్నికలు ఉంటాయనే ఉద్దేశంతో పోటీకి ఆయా పార్టీల నేతలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే ఎన్నికలు మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఎప్పుడు జరుగుతాయోనని ఆరా తీస్తున్నారు. గతంలో ఉన్న అభ్యర్థులతో పాటు కొత్త వారు కూడా పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 1,740 జీపీలలో ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల చర్చే ఉంది.

News June 1, 2024

NLG: వడదెబ్బతో ఇద్దరు మృతి

image

జిల్లాలో వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. మునుగోడు మండలం ఊకోండి గ్రామానికి చెందిన కమ్మలపల్లి మమత (30), రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో నివాసం ఉంటున్న భీమవరానికి చెందిన కర్రీ రాజు (40) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. జిల్లాలో మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల పైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

News June 1, 2024

నల్గొండ, భువనగిరిలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండడంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. గత ఎన్నికల్లో‌ రాజధాని ఓటర్లు నల్గొండలో (INC), భువనగిరి(INC)ని గెలిపించుకొన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇక సాయంత్రం 6.30 తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్‌ ఎవరివైపు అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

News June 1, 2024

నల్గొండ: రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు

image

నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం కేతపల్లిలో రికార్డు స్థాయిలో 46.8° ఉష్ణోగ్రత నమోదైంది. దామరచర్లలో 46.3° ఉష్ణోగ్రత నేరేడుగోమ్ము, కామారెడ్డిగూడెం, నకిరేకల్ , నాంపల్లి, నిడమానూరు, హాలియా, కట్టంగూరులో 45 డిగ్రీలు అత్యల్పంగా చింతపల్లి మండలంలో 40.1° ఉష్ణోగ్రత నమోదయ్యాయి. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ ప్రధాన పట్టణాల్లో ఎండ తీవ్రతకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

News June 1, 2024

NLG: గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు ఏర్పాట్లు

image

జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని NLG జిల్లా స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర ఆదేశించారు. గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ విషయమై నల్లగొండలో శుక్రవారం ఆయన నిర్వహించిన కో- ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని.. 16,899 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.