India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శౌర్యచక్ర అవార్డు గ్రహీత కుక్కుడుపు శ్రీనివాస్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇంటెలిజెన్స్ అవార్డును గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా స్వీకరించి గ్రామం పేరును మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. శ్రీనివాస్ సాధించిన ఈ ఘనత తమ గ్రామం పేరును నిలబెట్టిందని గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులు ఆయనను అభినందించారు.
రావులపెంటకి చెందిన కోట నవీన్ కుమార్ వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్ ఆవిష్కరణకు గాను విలేజ్ ఇన్నోవేషన్ అవార్డు-2025 గెలుచుకున్నారు. మాజీ సర్పంచ్ దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి నవీన్‌ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీరాంరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ తరి సైదులు, ఉపాధ్యాయులు లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు.
దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ విస్తరణ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఎండోమెంట్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఆలయాన్ని సందర్శించారు. సుమారు రూ.4కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో స్థపతి శ్రీ వల్లి నాయర్, దుర్గాప్రసాద్, గణేశ్, కిరణ్, ఆలయ ఛైర్మన్ చీదేటి వెంకట్ రెడ్డి, ఈవో జల్లేపల్లి జయరామయ్య, దేప కరుణాకర్ రెడ్డి ఉన్నారు.
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో జనవరి 30 నుంచి జరగాల్సిన పీజీ లా & ఎంసీఏ పరీక్షలను ఫిబ్రవరి 8 నుంచి నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన పోటీ పరీక్షల కారణంగా అకడమిక్ పరీక్షల కోసం సమాయత్తానికి కొంత సమయం కావాలంటూ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 26 నుంచి 4 నూతన పథకాల అమలు ప్రారంభమవుతుందని రాష్ట్ర ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా పథకాల అమలుకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ పథకాల అమలుకై గ్రామ, వార్డుసభలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
నల్లగొండ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా ఏడాది కాలంలో రూ.500 కోట్లు మంజూరు చేయించి తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు చేపట్టామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. 11లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 11 నీటి ట్యాంకులను నిర్మిస్తున్నామని.. వచ్చే ఏప్రిల్ నుంచి ప్రతిఇంటికి ప్రతిరోజు కృష్ణా తాగునీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తిప్పర్తి మండల పరిధిలోని తానేదారుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొండ్ర సైదులు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక నేతలు, గ్రామస్థులను ఆప్యాయంగా పలకరించారు.
నల్గొండ జిల్లాలోని నాలుగు రోజులు గ్రామసభల్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. నాలుగు పథకాలకు 1,17,644 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రైతు భరోసాకు 844, రేషన్ కార్డులు 53,844, ఇందిరమ్మ ఇళ్లు 47,471,ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు15,485 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.
2024- 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక సహాయం కొరకు వివిధ రకాల దివ్యాంగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళా, శిశు, దివ్యాంగుల వయవృద్ధుల సంక్షేమ శాఖ నల్లగొండ జిల్లా అధికారి కెవి కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీ లోపు tsobmms.cgg.gov.in నందు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
గ్రామీణ, గిరిజన, పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల విడిది కోసం హోమ్ స్టే నిర్వహణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం .శివాజీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ధర్తి ఆబ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ అనే పథకంలో భాగంగా పర్యాటక, గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు ఇంటిలోనే తాత్కాలిక నివాస యోగ్యం కల్పించే హోమ్ స్టే కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.