India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NZB ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆసుపత్రి రేకుల షెడ్డు కింద అపస్మారక స్థితిలో పడి ఉండడంతో సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయసు 40-45 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. మృతుడి జేబులో తినాలి రవి, ఆర్మూరు మండలం మామిడిపల్లి అనే ఆధార్ కార్డు ఉందన్నారు.
జక్రాన్‌పల్లిలో బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. గ్రామానికి చెందిన మాడవీరి ముత్యం(50) తాగిన మైకంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. బావిలో మృతదేహం తేలడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ తిరుపతి మృతదేహాన్ని బయటకు తీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా వాసికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ రెడ్ క్రాస్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. వచ్చే నెల 13న రాష్ట్రపతి భవన్‌లో జరిగే సమావేశంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్‌ను జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు అభినందించారు.
రాహుల్ గాంధీ కాదు.. ఎలక్షన్ గాంధీ అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. శనివారం ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో వచ్చారు.. కానీ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, బుల్డోజర్లు పెట్టి పేదల ఇళ్లు కూల్చినప్పుడు, హెచ్‌సీయూలో చెట్లు పీకేస్తున్నప్పుడు రాలేదన్నారు. ‘గతంలో చెప్పాను.. వంద సార్లు అయినా పిలుస్తా.. రాహుల్ గాంధీ .. ఎలక్షన్ గాంధీ’ అని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు ఎంపీ రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇందులో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహేర్ బిన్ హందాన్ తదితరులు ఉన్నారు.
రాహుల్ గాంధీ హైదరాబాద్ రాకను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత Xలో ఎద్దేవా చేశారు. “దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం..” అంటూ పేర్కొన్నారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసగించారన్నారు. హైదరాబాద్ పర్యటనలో లాఠీ దెబ్బలు తిన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను రాహుల్ గాంధీ పరామర్శించాలని డిమాండ్ చేశారు. అలాగే పలు ప్రశ్నలు సంధించారు.
నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి.. శుక్రవారం మెండోరాలో 45.3℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు వేల్పూర్ 45℃, నిజామాబాద్ 44.9, ముప్కాల్ 44.9, ఆర్మూర్ 44.7, నందిపేట, ఏర్గట్ల 44.5, మాగ్గిడి, ఎడపల్లి, బాల్కొండ 44.4, మక్లూర్, కమ్మర్పల్లి, మోస్రా 44.3, లక్మాపూర్, ఇస్సాపల్లి 44.2, జక్రాన్‌పల్లి 44.1, తొండకూర్ 44, పాల్దా, చిన్నమావంది, గోపన్నపల్లి, నవీపేట్ 44, రెంజల్లో 43.8℃గా నమోదైంది.
బోధన్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి బోధన్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎడపల్లి ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి తెలిపారు. మద్యం సేవించి వాహనలను నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని ఎస్ఐ పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోస్రాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మోస్రాకు చెందిన కుమ్మరి గంగాధర్(45) రెండు రోజుల క్రితం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మహేశ్ కుమార్ చెప్పారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఇండియా హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ అవార్డు-2025కు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రాంమెాహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఎడ్యుకేషన్ వరల్డ్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. స్వయం ప్రతిపత్తి హోదాలో ఉత్తమ ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్రంలో ఐదో స్థానం సాధించిందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.