India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ నగరంలోని అటవీ శాఖ కార్యాలయం సమీపంలో మురుగు కాల్వలో రెండేళ్ల బాలిక కాలువ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. బుధవారం సాయంత్రం ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. కాసేపటికి చిన్నారి తల్లి ఈ విషయాన్ని గుర్తించి స్థానికులకు సమాచారం ఇవ్వగా డిజాస్టర్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా సాయంత్రం భారీ వర్షం కురువగా కాల్వలో వరద నీటి ప్రవాహం పెరిగింది.
బీమా డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన ఘటన నస్రుల్లాబాద్‌లో చోటుచేసుకుంది. దుర్కి గ్రామానికి చెందిన అంజవ్వ (46)ను ఆమె కుమారుడు సాయికుమార్ (23) మద్యం మత్తులో కొట్టడంతో మృతి చెందింది. తండ్రి మృతి చెందగా వచ్చిన బీమా డబ్బులు ఇవ్వాలని తల్లిని వేధించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో కర్రతో సాయికుమార్ తల్లిని చితకబాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు ఏఎస్ఐ వెంకట్ రావు తెలిపారు.
దివ్యాంగ విద్యార్థులు జాతీయ స్కాలర్షిప్ కోసం సకాలంలో దరఖాస్తులు సమర్పించాలని కామారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి బావయ్య తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ నూతన లేదా రెన్యువల్ దరఖాస్తులు www.scholorships.gov.inవెబ్సైట్ లో చేసుకోవాలని సూచించారు.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో తగ్గుతోంది. ఈ మేరకు బుధవారం ఉదయం 9 గంటలకు 7,490 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తోంది. గత 24 గంటల్లో యావరేజ్‌గా 10,591 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. తాజాగా ఔట్ ఫ్లోగా 4,472 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80TMCలకు గానూ ప్రస్తుతం 50.706 TMCల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని ఒకటో టౌన్ ఏఎస్సై గుండెపోటుతో మృతి చెందాడు. ఏఎస్ఐ దత్తాద్రి బుధవారం ఉదయం ఇంట్లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఒకసారిగా కుప్పకూలాడు. అనంతరం కుటుంబీకులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దత్తాత్రి మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పట్టణాలు ప్లాస్టిక్ మయమయ్యాయి. ఇదే పరిస్థితి పల్లెల్లోనూ.. నెలకొంది. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం జరుగుతోంది. పట్టణాలలో రోజూ ఉత్పత్తి అయ్యే వ్యర్థాల్లో నాలుగో వంతు ప్లాస్టిక్ ఉంటోంది. ప్లాస్టిక్ వినియోగంపై మునిసిపాలీటీలో పంచాయతీల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. దీంతో వ్యాపారులు యథేచ్ఛగా నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తూనే విక్రయాలు జరుపుతున్నారు.
రాఖీ పండగ ఆర్టీసీకి కలిసిసోచ్చింది. ఈనెల 18, 19 తేదీల్లో 6.49 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. రాఖీ పండగ వేళ మహిళలు ఆర్టీసీల్లో ప్రయాణించారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీలో ప్రయాణించిన వారి సంఖ్య పెరిగిందని అధికారులు వెల్లడించారు. 18తేదీన మొత్తం ₹1.42 కోట్ల ఆదాయం రాగా.. 2.90 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారు. 19 తేదీన మొత్తం ₹1.72 కోట్ల ఆదాయం రాగా.. 3.59 మంది ప్రయాణించారు.
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) కోసం జిల్లాలో నాలుగు హెల్ప్ లైన్ డెస్కులు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్ హెల్ప్ డెస్క్ సెల్ నెంబర్ 8985914729, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ సెల్ నెంబర్ 9441801160, బాన్సువాడ మున్సిపాలిటీ సెల్ నెంబర్ 6301707191, కామారెడ్డి మున్సిపాలిటీ సెల్ నెంబర్ 9885817455 లను సంప్రదించాలని చెప్పారు.
* కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తారు: వేముల
* కాంగ్రెస్ ని నమ్ముకుంటే ఆత్మహత్యలు తప్ప ఏమీ మిగలవు : MLA ధన్పాల్
* బోధన్లో 11 మందిపై కుక్కల దాడి
* వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి
* జిల్లాలో ప్రయాణికులతో కిక్కిరిసిన పలు RTC బస్టాండ్లు
* భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
* మాక్లూర్: నీటి కుంటలో వ్యక్తి మృతదేహం లభ్యం
* మద్నూర్: కాంగ్రెస్ నుండి సంగమేశ్వర్ సస్పెండ్
చేపల వేటకు వెళ్లిన ఒకరు ప్రమాదవశాత్తు దుర్మరణం చెందిన ఘటన కోటగిరి దామర చెరువులో మంగళవారం జరిగింది. మధ్యాహ్నం వేళ మండల కేంద్రానికి చెందిన తోకల రాములు (40) అనే వ్యక్తి దామర చెరువులో చేపలు పడుతుండగా చేపలు పట్టే వల కాళ్లకు చుట్టుకొని నీటిలో మునిగాడు. నీటిలో ఊపిరాడక మృతి చెందాడని మృతుని భార్య మల్కవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సందీప్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.