India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామారెడ్డి జిల్లాలోని పోచారం, నిజాంసాగర్, కౌలాస్ ప్రాజెక్టుల్లో నీటి మట్టం వివరాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం జిల్లా స్థాయి అధికారులతో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
భారీ వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా కూడా ప్రాణ, ఆస్తి నష్టం వంటివి వాటిల్లకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడుతూ వర్షపు జలాలు రహదారుల పై నుండి ప్రవహించే సమయాలలో లెవెల్ వంతెనలు, కాజ్ వేలు, ఇతర సమస్యాత్మక ప్రాంతాల మీదుగా రాకపోకలను నిషేధిస్తూ, ఇతర ప్రాంతాల మీదుగా వాహనాలను దారి మళ్లించాలని సూచించారు.
బాసర సరస్వతి ఆలయంలో చోరికి పాల్పడ్డ నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ జానకిషర్మిల వివరించారు. ఆర్మూర్‌కు చెందిన సాయికుమార్ నవీపేటలో నివాసం ఉంటున్నాడు. మద్యానికి అలవాటు పడిన అతను చోరీ చేయాలని అనుకొని బుధవారం రాత్రి బాసరకు చేరుకున్నాడు. ఆర్థరాత్రి ఆలయంలో చొరబడి, హుండీ పగలగొట్టి రూ. 14,200 కాజేశాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
కామారెడ్డి చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పట్టణ వర్తక వాణిజ్య, వ్యాపార, సంఘాలు నేడు బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. నేడు అన్ని వ్యాపార సంస్థలు, స్కూల్స్ కాలేజీలు స్వచ్ఛందంగా బంద్ చేసి ఉదయం 9 గంటలకు పట్టణ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు.
రుణమాఫీపై మండలాల వారీగా నోడల్ అధికారులను నియమించినట్టు NZB జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ తెలిపారు. దీంతో రైతు రుణమాఫీ కాని రైతులు అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. బ్యాంకర్ల వల్ల జరిగిన తప్పిదాలు, కుటుంబ నిర్ధారణ జరగనివి, మిస్సింగ్ డాటా, పంట రుణమాఫీ వచ్చి తిరిగిన రైతులు వాటిపై ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఉదయం 10గంటల నుంచి సా. 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
రాఖీ పండగ సందర్బంగా నగరంలోని ఓం శాంతి బ్రహ్మకుమారి ఆర్గనైజషన్, తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగులు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకు సోమవారం రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరాయి స్త్రీని కూడా అక్కగా, చెల్లిగా చూసే గొప్ప సంస్కృతి మన దేశంలోనే ఉందన్నారు. అలాంటి సంస్కృతిని, సోదరభావాన్ని పెంపొందించే పండుగే రాఖి అని పేర్కొన్నారు.
రుణమాఫీపై దరఖాస్తుల స్వీకరణకు మండలాల వారీగా నోడల్ అధికారులను నియమించినట్టు జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ తెలిపారు. రుణమాఫీ కాని రైతులు తమతమ మండల నోడల్ అధికారిని కలిసి ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
నిజామాబాద్ జిల్లా ఉమన్ ఫుట్‌బాల్ జట్టుకు రాష్ట్రస్థాయి ఉమెన్ సాకర్ ఛాంపియన్షిప్ ట్రోఫీ దక్కింది. 4 రోజులుగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న 10వ రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ రోజు వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో నిర్వాహకుల నిర్ణయం మేరకు ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా జడ్జి సునీత కుంచాల టాస్ వేయగా నిజామాబాద్ జట్టు గెలిచింది. మెదక్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
రాఖీ వేళ ఉమ్మడి NZB జిల్లాలోని బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. సోదరులకు రాఖీలు కట్టడానికి పుట్టింటికి వచ్చిన సోదరీమణులు తిరిగి ప్రయాణమవుతున్నారు. దీంతో బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ దృష్ట్యా బస్సుల సంఖ్య పెంచినప్పటికీ తమకు సరిపడా బస్సులు అందుబాటులో లేవని ప్రయాణికులు వాపోతున్నారు. ఒక్కో బస్సు కోసం సుమారు గంటల వరకు వేచి చూడాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రక్షాబంధన్ వేడుకను పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టరేట్లోని వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులు సోమవారం ఉన్నతాధికారులకు రాఖీలు కట్టారు. బ్రహ్మకుమారీలు, వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సైతం అధికారులకు రాఖీలు కట్టారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్ తదితర అధికారులకు రాఖీలు కట్టి రక్షా బంధన్ ప్రాశస్త్యాన్ని చాటారు.
Sorry, no posts matched your criteria.