India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై వాహనాల పార్కింగ్ చేయించడమే కాకుండా, పోలీసులు వేధిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన ఢిల్లీవాలా స్వీట్ హోమ్ పై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ వన్ టౌన్ SHO విజయ్ బాబు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం స్వీట్ హోమ్ ముందు ప్రధాన రహదారిపై అడ్డంగా ఉన్న వాహనాలను తీయించే విషయంలో పోలీసులతో యాజమాన్యం గొడవపడి వారే పోలీసులపై తప్పుడు ప్రచారం చేశారన్నారు.
వర్షాల కోసం ఆంజనేయస్వామి ఆలయాన్ని నీటితో నింపారు రైతులు. వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పిట్లం మండలం అన్నారం గ్రామ ఆంజనేయస్వామి ఆలయంలో గ్రామానికి చెందిన రైతులు జలాభిషేకం చేశారు. వర్షాలు కురవక విత్తనాలు మొలకెత్తడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపించాలని రైతులు స్వామిని వేడుకున్నారు.
రాఖీ వచ్చిందంటే చాలు ఎంతదూర ప్రాంతాల్లో ఉన్నా తమ సోదరీమణుల వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకుంటారు. ‘నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష’ అంటూ ధైర్యం చెప్పుకుంటారు. సమాజంలో ఇతర మహిళల పట్ల సైతం అదే తీరులో సోదరభావంతో మెలిగితే దేశం సురక్షితంగా ఉంటుంది. ఒక్క 2023లోనే నిజామాబాద్ జిల్లాలో 568 మంది, కామారెడ్డిలో 366 మంది అతివలపై అఘాయిత్యాలు జరిగాయి. మరి మనం ఆడపిల్లలకు ఏ మేర రక్షణగా ఉన్నామో ఆలోచించుకోవాలి.
బిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామస్థులు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని చూడకుండా విరాళాలు పోగు చేసుకుని సొంతంగా 19 ఏళ్ల క్రితం రైల్వే ప్లాట్‌ఫాం నిర్మించుకున్నారు. ఒక్కొక్కరికీ రూ.25 చొప్పున జమచేసుకున్నారు. వివిధ సంఘాల నుంచి విరాళాలు స్వీకరించారు. అంతేగాక టికెట్లు ఇవ్వడంతో పాటు రైళ్ల సమాచారం తెలిపేందుకు తాత్కాలిక ఉద్యోగిని కూడా నియమించుకున్నారు. రైళ్లు ఆ ప్లాట్‌ఫాంపై ఆగేలా చేశారు.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల పరిధిలో ఆదివారం ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లి గోదావరి నదిలో గల్లంతయ్యాడు. రెంజల్ మండలం కందకుర్తి గోదావరి నదిలో బోధన్ మండలం బిల్లాల్ గ్రామానికి చెందిన సాయికుమార్ (22) అనే యువకుడు.. స్నేహితుడితో కలిసి స్నానం కోసం నదిలో దిగి, ఈత రాక పోవడంతో నీటిలో మునిగి పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సోదర భావానికి ప్రతీక అయిన రక్షాబంధన్ (రాఖీ పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ రాఖీ పండగను సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. తమ సోదరీమణులకు ఏ ఆపద రాకుండా ఎల్లవేళలా అండగా నిలబడతామని సోదరులు భరోసాను అందించడం ఈ పండుగ విశిష్టత అని గుర్తు చేశారు.
సోమవారం రాఖీ పండుగ సందర్భంగా మార్కెట్లలో రాఖీల విక్రయాలు జోరందుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేశారు వ్యాపారస్థులు. ఈ సారి మహిళలు కూడా దూరప్రాంతాల్లో ఉన్న అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి వెళ్లేందుకు సన్నద్ధమవుతన్నారు. దీంతో మార్కెట్లో రాఖీల కొనుగోలు సందడి నెలకొంది. ఈ పండుగ కోసం విభిన్న డిజైన్లలో ఉన్న రాఖీలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
మద్యం మత్తులో ఓ యువకుడు గొంతుకున్నాడు. ఈ ఘటనలో కామారెడ్డిలో చోటుచేసుకుంది. బీర్కూర్ చెందిన కేశవ్ (25) ఆదివారం గొంతుకోసుకుని కామారెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. ఇది గమనించిన పోలీసులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ గొడవల నేపథ్యంలో గొంతు కోసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేశవ్ ఇది వరకు 3 రోజుల క్రితమే గొంతు కోసుకున్నాడు. ఇవాళ మరోసారి దాన్ని రిపీట్ చేశాడు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం హృదయ విదారకమైన ఘటన వెలుగు చూసింది. కళ్ళు తెరిచి లోకాన్ని చూడని పసికందును కసాయి తల్లిదండ్రులు డ్రైనేజీలో పడవేశారు. రైల్వే స్టేషన్ పక్కనగల ప్రధాన డ్రైనేజీలో ఓ పసికందు విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని పసికందు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
నిజామాబాద్‌కు చెందిన మిట్టపల్లి రిత్విక స్విమ్మింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. ఆదివారం సికింద్రాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ సీనియర్ మహిళల పోటీల్లో ఆమె పాల్గొంది. వివిధ రకాల పోటీల్లో ఆమె స్వర్ణపతకాలు సాధించింది. సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు మంగళూరులో జరిగే ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పోటీల్లో ఆమె పాల్గొననుంది.
Sorry, no posts matched your criteria.