India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 93 మందికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రశంసా పత్రాలను అందజేశారు. ట్రాఫిక్ ACP మస్తాన్ అలీ, CI శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ, భిక్షపతి తదితరులతో పాటు వివిధ డివిజన్లకు చెందిన SIలు, HCలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, సిబ్బంది అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు.

2025-26 యాసంగి సీజనులో 5.33 లక్షల ఎకరాల సాగు అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఇప్పటి వరకు వరి 3.36 లక్షల ఎకరాలు, శనగ 14 వేల ఎకరాలు, మొక్క జొన్న 32 వేల ఎకరాలు, ఎర్ర జొన్న 21 వేల ఎకరాల్లో మొత్తం 4.10 లక్షల ఎకరాలలో వివిధ పంటలు రైతులు సాగు చేసినట్లు చెప్పారు. వీటి కోసం 1,03,650 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయడం జరిగిందని ఆమె వివరించారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 115 మందికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా అధికారులు సాయ గౌడ్(DRDA), శ్రీనివాసరావు(DPO), అరవింద్ రెడ్డి (డిస్ట్రిక్ట్ సివిల్ సప్లయ్ అధికారి) అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రశంసించారు. అలాగే పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు పరుస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లడానికి కృషి చేస్తోందన్నారు. జిల్లాలో మహిళల రక్షణకు షీ టీం సమర్థవంతంగా పని చేస్తున్నాయని కొనియాడారు.

జిల్లా పంచాయితీరాజ్ ఇంజినీరింగ్ శాఖ పరిధిలో నిజామాబాద్ జిల్లాలో వివిధ రకాల పథకాల కింద 8,912 అభివృద్ధి పనులకు రూ.560.88 కోట్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. ఇందులో 6,097 పనులకు రూ.453.97 కోట్లు వెచ్చించి పనులు పూర్తి చేశారన్నారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని కలెక్టర్ వివరించారు.

నిజామాబాద్ జిల్లాలో కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3,529 మంది లబ్ధిదారులకు రూ.35.33 కోట్లు పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అలాగే షాదీ ముబారక్ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 2,223 మంది లబ్ధిదారులకు సుమారు రూ.22.25 కోట్లు ఇచ్చామన్నారు.

2025-26 సంవత్సరంలో 5,678 సంఘాలకు రూ.182 కోట్లు స్త్రీ నిధి, బ్యాంకు ద్వారా ఋణాలు మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. అలాగే 19,969 సంఘాలకు రూ.1,228 కోట్లు లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 12,700 సంఘాలకు రూ.1,109 కోట్లు ఋణాలు బ్యాంక్ లింకేజ్ ద్వారా అందించారన్నారు. వడ్డీ రాయితీ కింద 2024-25లో ఏప్రిల్-24 నుంచి జనవరి 25 వరకు 40,199 సంఘాలకు రూ.44.95 కోట్లు విడుదల చేశారన్నారు.

2025-26వ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 85,034 కుటుంబాల్లోని 1,17,886 కూలీలకు 16.08 లక్షల పని దినాలు కల్పించి రూ.40.52 కోట్లు కూలీల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. సరాసరి వేతనం రోజుకు రూ.251.93 చెల్లించి ప్రతి కుటుంబానికి 22 రోజుల పని కల్పించారన్నారు. కూలీలకు రూ.40.52 కోట్లు, మెటీరీయల్ కాంపొనెంట్ కింద రూ.21.13 కోట్లు మొత్తం రూ.61.65 కోట్లు జమ చేశారన్నారు.

ఉపాధ్యాయ, ఉద్యోగులు, విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగుల అన్ని రకాల పెండింగ్ బిల్లుల విడుదల చేయాలని, PRC అమలు కోసం ఎమ్మెల్సీల నిరవధిక సమ్మెకు ఇందూరు తపస్ పూర్తి మద్దతు ప్రకటించింది. టీచర్ ఎమ్మెల్సీలు AVN రెడ్డి, మల్క కొమరయ్య, గ్రాడ్యుయేట్ MLC అంజిరెడ్డి మంగళవారం 24 గంటల నిరవధిక ధర్నాను హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో నిర్వహిస్తున్నారు. ఇందూరు తపస్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగానికి సంబంధించి NZB జిల్లాలో ఇప్పటి వరకూ 2,89,727 కుటుంబాలకు ప్రతి నెలా జీరో బిల్లులు జారీ చేస్తున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.219.96 కోట్ల సబ్సిడీని అందజేసిందన్నారు. అలాగే నాయీ బ్రాహ్మణ, రజక వృత్తుల్లో ఉన్న 3,023 మంది లబ్ధిదారులకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నారన్నారు.
Sorry, no posts matched your criteria.