India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎక్సైజ్ శాఖ బాసర జోన్‌లో 50 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 200 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. బాసర జోన్‌లోని నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో పని చేస్తున్న HC, కానిస్టేబుళ్ల బదిలీలు జరిగాయి. ఉద్యోగులు కొత్త స్థానాల్లో విధుల్లో చేరారు. కాగా జిల్లా పోస్టులను, జోనల్ పోస్టుగా బదిలీల చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ గదిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, ఒక వేళ డ్రగ్స్‌కు వ్యసనంగా మారితే తగిన ట్రీట్మెంట్ తీసుకొని బయట పడాలని హితవు పలికారు. DMHO రాజశ్రీ, నాగమొహన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారి నోటి దురుసుతనం వ్యవహారం నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖలో కలకలం రేపుతోంది. జిల్లాకు చెందిన డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని ఎక్సైజ్ ఉన్నతాధికారి బూతులు తిట్టడంతో ఆయన గుండెపోటు గురై గురువారం అర్ధరాత్రి హైదరాబాద్ కార్యాలయంలోనే కుప్పకూలిన వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం DC ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జన గణన విధులను ఎస్జీటీ ఉపాధ్యాయులకు కేటాయించాలని జిల్లా ఎస్జీటీ యూనియన్ అధ్యక్షుడు వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. జనాభా గణన విధులను ఎస్జీటీలకు కాకుండా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు కేటాయించడం అన్యాయమన్నారు. గతంలో నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే (SKL) నిధులు ఇప్పటి వరకు చెల్లించలేదని గుర్తుచేశారు.

మాతా శిశు మరణాలు జరగకుండా పర్యవేక్షించాలని NZB జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.రాజశ్రీ కోరారు. శుక్రవారం NZB ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో జరిపిన సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా DMHO మాట్లాడారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆశా కార్యకర్తలు గృహ సందర్శనలో వారి ప్రణాళికకు అనుగుణంగా గర్భిణులను, బాలింతలను తప్పకుండా పరిశీలించాలని ఆదేశించారు.

మున్సిపల్ కార్మికులందరూ వైద్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని, ఏ కార్మికుడు కూడా అనారోగ్యానికి గురి కావద్దని NZB మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జీవనశైలి వ్యాధులు, క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. DMHO రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

టీయూ చేపట్టిన జాతీయ సదస్సు రెండో రోజు(ముగింపు) సదస్సులో ఓయూ జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ ప్రొ.రోజా రాణి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. క్రిస్పర్ టెక్నాలజీ వంటి ఆధునిక విధానాలు వైద్య, వ్యవసాయ రంగాల్లో జన్యు పరిణామాలు, జన్యు సర్దుబాటు వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. డా.సుమలత పలు అంశాలపై ప్రసంగించారు. కన్వీనర్ డా.ప్రసన్న షీలా, ఆర్గనైజింగ్ సెక్రటరీ కిరణ్మయి పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.