Nizamabad

News April 10, 2026

NZB: ఆయుష్ విభాగంలో అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు: DMHO

image

ఆయుష్ విభాగంలో అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు ఉన్నాయని NZB జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.రాజశ్రీ తెలిపారు. శుక్రవారం కోటగల్లీలో నిర్వహించిన ప్రపంచ హోమియో దినోత్సవంలో భాగంగా ఆమె మాట్లాడారు. ప్రజలు ఆయూష్ విభాగాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో 425 మందికి ఆరోగ్య పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు. డాక్టర్ గంగా దాస్, డాక్టర్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.

News April 10, 2026

TU: ఆ వార్త అవాస్తవం: రిజిస్ట్రార్

image

టీయూలో డిపాజిట్ల గోల్‌మాల్ అనే శీర్షికతో ఓ పత్రికలో ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవమని టీయూ వీసీ ప్రొ.టి.యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరి తెలిపారు. శుక్రవారం వారు ఆ వార్తను ఖండించారు. డిపాజిట్లకు సంబంధించి ఏ ఒక్క రూపాయి అవకతవక వ్యత్యాసం వచ్చినా రిజిస్ట్రార్‌గా తాను పూర్తి బాధ్యత వహిస్తానని ప్రొ.యాదగిరి తెలిపారు. ఇక భూముల విషయంలో సుప్రీంకోర్టులో వాదనలకు అడ్వకేట్‌ను నియమించామని పేర్కొన్నారు.

News April 10, 2026

NZB: GGH ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా డా.నాగమోహన్

image

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (GGH) ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా ప్రభుత్వ వైద్య కళాశాల, GGH ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ నాగ మోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంత వరకు ఇక్కడ ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న విధులు నిర్వహిస్తున్న పి.శ్రీనివాస్ నల్గొండ GGHకు బదిలీ అయ్యారు.

News April 10, 2026

కందకుర్తిలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

రెంజల్ మండలం కందకుర్తిలో ఈనెల 11న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. కందకుర్తిలో స్ఫూర్తి మందిరాన్ని మోహన్ భగవత్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్-కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, రెంజల్ తహశీల్దార్, ఆర్&బి డీఈతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

News April 10, 2026

రేపు నిజామాబాద్ జిల్లాకు RSS చీఫ్ మోహన్ భాగవత్

image

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ శనివారం NZB జిల్లాలో పర్యటించనున్నారు. RSS వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరాం పంత్ హెడ్గేవార్ పూర్వీకుల స్వగ్రామమైన జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తిలో నిర్మించిన కేశవ స్ఫూర్తి మందిరాన్ని మోహన్ భాగవత్ ప్రారంభించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలు కంద కుర్తితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

News April 10, 2026

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో భారీ చోరీ

image

​ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ విశాఖ కాలనీలో గురువారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. వినోద్ అనే వ్యక్తి తన కుమార్తె పెళ్లి నిమిత్తం గ్రామ దేవతల పూజకు కుటుంబంతో కలిసి వెళ్లగా, దుండగులు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలోని 14 తులాల బంగారం, లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 10, 2026

ఆర్మూర్: రాష్ట్రపతికి గ్రీన్ చాలెంజ్ ఇంటియాటివ్స్ పుస్తకం అందజేత

image

రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కె.ఆర్ సురేశ్ రెడ్డి గురువారం కలిసి గ్రీన్ చాలెంజ్ ఇంటియాటివ్స్ పుస్తకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి, పార్లమెంట్ మాజీ సభ్యుడు సంతోష్ పాల్గొన్నారు.

News April 10, 2026

ఆర్మూర్: రాష్ట్రపతికి గ్రీన్ చాలెంజ్ ఇంటియాటివ్స్ పుస్తకం అందజేత

image

రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కె.ఆర్ సురేశ్ రెడ్డి గురువారం కలిసి గ్రీన్ చాలెంజ్ ఇంటియాటివ్స్ పుస్తకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి, పార్లమెంట్ మాజీ సభ్యుడు సంతోష్ పాల్గొన్నారు.

News April 9, 2026

నిజామాబాద్: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా సాయన్న

image

నిజామాబాద్ జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్య నిర్వహణాధికారిగా పని చేసిన సాయన్న CEOగా పదోన్నతి పొంది నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా (DRDA) గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన అభివృద్ధి పనులను పర్యవేక్షించేలా చూస్తానన్నారు.

News April 9, 2026

NZB: అరైవ్-అలైవ్ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహించాలి

image

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు కొనసాగనున్న అరైవ్- అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో విస్తృత స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పొలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. కలెక్టర్, సీపీ గురువారం సాయంత్రం శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమష్టి కృషితో ‘అరైవ్-అలైవ్’ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.