India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వర్ని మండలంలో దారుణం జరిగింది. జలాల్పూరులో పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లినే కొడుకు హత్య చేశాడు. SI మహేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయవ్వ(57)ను ఆమె కొడుకు సాయిలు పెన్షన్ డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు. ఈ క్రమంలో తల్లిపై కుర్చి, రాయితో దాడి చేసి పారిపోయాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చుట్టుపక్కల వారు బోధన్ ఆస్పత్రికి తరలించారు. సాయవ్వను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.
APలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని MLC కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. భద్రాచలంలో అంతర్భాగంగా ఉండి ఏపీలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలన్నారు. యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు.
ఈ ఏడాది వన మహోత్సవంలో జిల్లా వ్యాప్తంగా 51.11 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పక్షం రోజుల్లోనే పూర్తి స్థాయిలో మొక్కలు నాటి సంపూర్ణ లక్ష్యం సాధించేలా ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేశామన్నారు. గత సంవత్సరం వన మహోత్సవం సందర్భంగా 43 లక్షల మొక్కలు నాటారని చెప్పారు.
2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికుల హక్కులను హరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను సవరించడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్రంలోని BJP ప్రభుత్వం స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫోక్ డాన్సర్ జానూలిరి బుధవారం నిజామాబాద్ నగరంలో సందడి చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అక్కడి కాలేజ్ విద్యార్థులతో కలిసి వివిధ పాటలకు ఫోక్ డాన్స్ చేసి అందరిని అలరించారు. నిజామాబాద్ రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు మంచి భవిష్యత్తుతో ఉన్నత శిఖరాలకు చేరుకొని తమ తల్లిదండ్రులకు పేరు తీసుకుని రావాలని సూచించారు.
NZB జిల్లాలో కొన్ని రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో కొంతమంది రైతులు వరినాట్లు వేసుకోగా.. మరికొందరు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో గతేడాది 4,36,101.21 ఎకరాల్లో వరి పండించగా ఈ ఏడాది 4,37,135 ఎకరాల్లో పండించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నేటి వరకు 2,37,372 ఎకరాల్లో (58%) నాట్లు వేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
NZB కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు పరిధిలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో NZB పోలీస్ ఇంటలిజెన్స్‌లో పనిచేస్తున్న ASI భీమారావు భార్య భవాని మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. భవాని తన కుమారుడితో కలిసి బాసర అమ్మవారి దర్శనానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా వారి బైక్‌కు కుక్క అడ్డు వచ్చింది. దాన్ని తప్పించబోయే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. దీంతో బైక్ వెనకాల కూర్చున్న భవాని మృతి చెందారు.
మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు కురవక పోవటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP)కి చెప్పుకోదగ్గ స్థాయిలో ఇన్ ఫ్లో రావడం లేదు. గడిచిన 24 గంటల్లో కేవలం 4291 క్యూసెక్కులు మాత్రమే వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80TMCలు) కాగా, ప్రస్తుతం 1067 అడుగులు (19.537 TMCలు) మాత్రమే నీటి నిల్వ ఉంది. బాబ్లీ గేట్లు ఎత్తినా ఇప్పటి వరకు కేవలం 8.857 TMCల నీరు మాత్రమే వచ్చి చేరింది.
నిజామాబాద్ జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న 2,730 మల్టీపర్పస్ వర్కర్లకు 2025 ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 మాసాల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత GPల TGbPASS ఖాతాలలో జమ చేసిందని DPO శ్రీనివాస్‌రావు బుధవారం తెలిపారు. అందరూ ప్రత్యేకాధికారులు, పంచాయతి కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధవహించి వెంటనే సంబంధిత మల్టీపర్పస్ వర్కర్ల వ్యక్తిగత ఖాతాలకు వేతనాలు జమ చేయాలని ఆయన సూచించారు.
తెలంగాణ రైతాంగానికి ఎవరేం చేశారో తేల్చుకుందామని సవాల్ చేసిన CM రేవంత్ రెడ్డి.. మాటకు కట్టుబడకుండా ఢిల్లీకి పారిపోయాడని ఆర్మూర్ మాజీ MLA జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే కనీసం ఉపముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ చర్చకు రావాలని కేటీఆర్ కోరినా రాకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ డొల్లతనానికి నిదర్శనమన్నారు.
Sorry, no posts matched your criteria.