Nizamabad

News April 2, 2026

నిజామాబాద్: విజయవంతమైన గ్రామ, వార్డు సభలు

image

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామపంచాయతీలు,146 వార్డుల్లో నిర్వహించిన గ్రామ, వార్డు సభలు విజయవంతమయ్యాయి. కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేసి, అవసరమైన సౌకర్యాలు కల్పించారు.

News April 2, 2026

NZB: గ్రామ సభలో CM ఫోటో లేదు

image

సాధారణంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, గ్రామసభలు జరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల ఫోటోలు ఉండటం ప్రొటోకాల్‌లో భాగం. అయితే గురువారం నగరంలోని 15వ డివిజన్‌లోని అర్సపల్లిలో నిర్వహించిన గ్రామసభ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడంతో పాటు MIM చీఫ్ అసదుద్దీన్ ఫోటో ఉండడంతో అది స్థానిక రాజకీయ వర్గాల్లో, ప్రతిపక్షాల మధ్య వివాదానికి దారితీసింది.

News April 2, 2026

టీయూలో ప్రేరణ-2026

image

తెలంగాణ కామర్స్ అసోసియేషన్ (TCA), తెలంగాణ యూనివర్సిటీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రేరణ-2026 ఇంటర్ కాలేజియేట్ కామర్స్ ఫెస్ట్’లో భాగంగా వర్సిటీ స్థాయి పోటీలు గురువారం నిర్వహించారు. 200 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. 50 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి, ప్రిన్సిపల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

News April 2, 2026

NZB: కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలి: ఎంపీ సురేశ్ రెడ్డి

image

కాళేశ్వరం ప్రాజెక్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్ పాటిల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.ఆర్. సురేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం పైసా సాయం చేయకున్నా, కేసీఆర్ దార్శనికతతో నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. వాస్తవ విరుద్ధమైన మాటలు ఉపసంహరించుకోకుంటే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని హెచ్చరించారు.

News April 2, 2026

నిజామాబాద్: హనుమాన్ శోభాయాత్ర బందోబస్తు పర్యవేక్షించిన సీపీ

image

నిజామాబాద్ నగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా చేపట్టిన శోభాయాత్ర బందోబస్తును సీపీ సాయి చైతన్య గురువారం పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్ హాల్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా శోభాయాత్ర సరళిని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదనపు డీసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి, తదితరులు ఉన్నారు.

News April 2, 2026

మోస్రా: పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్

image

పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గురువారం మోస్రాలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 2, 2026

బోధన్: 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

బోధన్ పట్టణంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం తనిఖీ చేశారు. CC కెమెరా రికార్డింగ్ మధ్య ప్రశ్న పత్రాల సీళ్లు తెరిచారా లేదా అని తనిఖీ చేశారు. ఎక్కడా ఎలాంటి చిన్న తప్పిదానికి అవకాశం ఇవ్వకుండా, కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

News April 2, 2026

నిజామాబాద్: ‘మీ సేవ’ వాత.. భారీగా పెరిగిన ధరలు!

image

జిల్లాలో మీ సేవ సేవల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ప్రభుత్వం యూజర్ ఛార్జీలను 50% పెంచి, దానికి 18% జీఎస్టీని చేర్చడంతో మొత్తం 68% భారం పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ధరలతో రూ.35 ఉన్న ‘A’ కేటగిరీ సేవలు రూ.62కు, రూ.45 ఉన్న ‘B’ కేటగిరీ (కుల, ఆదాయ ధృవీకరణ) ధరలు రూ.80కి చేరాయి. జిల్లాలోని 250 కేంద్రాల్లో నిత్యం సేవలు పొందే ప్రజలు ఈ పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News April 2, 2026

NZB: సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి: కలెక్టర్

image

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని నిర్వహించారు. నిజామాబాద్ వినాయకనగర్‌లోని సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు.

News April 2, 2026

నిజామాబాద్: ప్రగతి వేదికగా గ్రామసభ

image

జిల్లావ్యాప్తంగా నేడు నిర్వహించే 545 గ్రామసభలు పల్లెల సమగ్ర అభివృద్ధికి దిక్సూచి కావాలి. మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ఉపాధి హామీ పనులపై ప్రజల భాగస్వామ్యంతో చర్చలు జరగడం అత్యవసరం. కేవలం మొక్కుబడి కార్యక్రమంగా కాకుండా, పారదర్శక నిర్ణయాలకు ఇవి వేదికలు కావాలి. గ్రామాల సమస్యలను గుర్తించి, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం ద్వారానే పల్లెలు ఆదర్శంగా తీర్చిదిద్దబడతాయి. ప్రతి పౌరుడు ఇందులో పాల్గొనాలి.